పుట:ది కేటల్ ట్రెస్‌పాస్ యాక్టు, 1871.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక వారము లొపల పశువులు క్లయిము చేయబడనిచొ ప్రక్రియ.

14.పశువులు బందెలో పెట్టబడిన తేదీ నుండి ఏడు దినములలొపల క్లయిము చేయబడనిచో బంచెల దొడ్డి రక్షకుడు ఆ సంగతిని అత్యంత సమీవమునగల పోలీను ఠాణా భాధ్యత వహించిన ఆధికారికి గాని జిల్లా మేజిస్ట్రేటు ఈ విషయమున నియమిం చునట్టి ఇతర అధికారికి గాని రిపోర్టు చేయవలెను.

అటుపై అట్టి అధికారి తన కార్యాలయములొ సుస్పష్టముగా కనుపించు భాగము నందు ఈ క్రింది వాటిని తెలియపరచు ఒక నోటీసును అంటించవలెను:

(ఎ) పశువుల సంఖ్య, వాటి వర్ణన;
(బి) ఆవి అభిగ్రహణము చేయబడిన స్థలము;
(సి) అవి బందెలో పెట్టబడిన స్థలము.

మరియు ఆ గ్రామములోను అభిగ్రహణము. చేసిన స్థలమునకు అత్యంత సమీపమునగల మార్కెట్టు వద్దను, దండోరా చ్వారా అట్టి నోటీనును చాటింపు చేయించవలెను, నోటీసు పెట్టిన తేదీ నుండి ఏడు దినముల లోఫల ఆ పశువులు క్లెయిము చేయబడనిచొ సదరు అధికారిగాని అతని సిబ్బందిలో నుండి అందు నిమిత్తమె ప్రతినియోజితుడై న అధికారిగాని బహిరంగ వేలముద్వ్వారా జిల్లా మేజిస్ట్రేటు సాధారణ లేక ప్రత్యేక ఉత్తరువుద్వారా అయా సమయములలో నిర్దేశించు నట్టి స్థలములలోను అట్టి సమయమునను మరియు అట్టి షరతులకు లోబడియు ఆ పశువులను విక్రయించవలెను;

అయితే, ఏవేని అట్టి పశువులు, పైన చెప్పినట్లు విక్రయింపబడనిచో సరనమైన ధర రాదని జిల్లా మేజిస్ట్రేటు అభిప్రాయపడినచొ ఆయన సబబని తలచురీతిగా వాటిని అమ్మవచ్చును

అభిగ్రహణము యొక్క శాసనబద్దతను గూర్చి'వివాదపడి డిపాజిటు చేయు సొంతదారుకు అప్పగింత.

15. సొంత దారుగాని అతని ఏజెంటుగాని హాజరై, అభిగ్రహణము శాశన విరుద్దమైనందున 20వ పరిచ్చేదము క్రింద సొంతదారు ఫిర్యాదు చేయనున్నాడను ఆధారముపై,సదరు జుర్మానాలను, ఖర్చులను చెల్లించుటకు నిరాకరించినచో, అపుడు ఆ జుర్మానాలను మరియు అ పశువుల విషయమున అయిన ఖర్చులను డిపొజిటు. చేసిన మీదట అ పశువులను అతనికి అప్పగించవలెను,

స్వంతదారు జుర్మానాలను ఖర్చులను చెల్లించుటకు నిరాకరించినప్పుడు లేక చెల్లించనప్పుడు ప్రక్రియ.

16, సొంతదారుగాని అతని ఏజెంటుగాని హాజరై సదరు జుర్మానాలను మరియు ఖర్చులను చెల్లించులకు నిరాకరించినచో లేక చెల్లించనిచో లేక (15వ పరిచ్భేదములో పేర్కొనబడిస సందర్భములో) వాటిని డిపాజిటు చేయనిరాకరించినచో లేక డిపాజిటు చేయనిచో, ఆ పశువులను, లేక వాటిలో అవశ్యక మైనన్నింటిని 14వ పరిచ్చేదములో నిర్దేశింపబడినట్లు అట్టి అధికారి అట్టి స్థలమున, అట్టి సమయమున మరియు అట్టి షరతులకు లొబడి, బహిరంగ వేలము ద్వారా విక్రయించవ లెను.

జుర్మానాలను మరియు ఖర్చులను. మినహాయించు కొనుట.

వసూలు చేయదగు జుర్మానాలను మరియు విక్రయమునకైన ఖర్చులు. ఏవేని ఉన్నచో, వాటితోసహ మేత వేయుటకు నీరు పెట్టుటకు అయిన ఖర్చులను ఆ విక్రయము ద్వారా వచ్చిన రాబడిలో నుండి మినహాయించుకొనవ లెను,

విక్రయింపబడని పశువులను మరియు క్రయధనములొ మిగిలిన దానిని అప్పగించుట.

సొంతదారుకుగాని అతని ఏజంటుకు గాని మిగిలినపశుపులను, మరియు క్రయ ధనములో ఏదేని మిగిలినచో ఆ మిగులును ఈ క్రింది వాటిని చూపు లెక్కతోసహ అప్పగించవలెను;__

(ఎ) అభిగ్రహణము చేయబడిన పళువుల, సంఖ్య;
(బి) అవి ఎంత కాలము నుండి బందెలో పెట్టబడియున్నవి;
(సి) జుర్మానాలు, మరియు అయిన ఖర్చుల మొత్తము;
(డి) విక్రయింపబడిన పశువుల సంఖ్య;
(ఇ) విక్రయము ద్వారా వచ్చిన రాబడి; మరియు
(ఎఫ్‌ ) ఆ రాబడి వ్యయము చేయబడిన రీతి.

రసీదు

సొంతదారుగాని అతని ఏజెంటు గాని తనకు పశువులు అప్పగింపబడినందుకును అట్టి లెక్క ప్రకారము క్రయధనములో (ఏదేని) మిగిలినది తనకు చెల్లించబడినందుకును రసీదు ఈయవ లెను,