పుట:ది కేటల్ ట్రెస్‌పాస్ యాక్టు, 1871.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అ భూమి ఉన్నట్టి గ్రామమున స్టాపింపబడిన బం దెలదొడ్డికి 1[ ఇరువది నాలుగు గంటల లోవల వాటిని పంపవలెను లేదా పంపబడునట్లు చేయవలెను.]

అభిగ్రహణములకు పొలీసుల తొడ్పాటు.

పోలీసు అధికారులందరును __

(ఎ) అట్టి అభిగ్రహణములకు ప్రతిఘటనను నివారించుటలోను,

(బి) అట్టి అభిగ్రహణములను చేయు వ్యక్తుల నుండి వాటిని తప్పించుటను నివారించుటలోను,

కోర బడినప్పుడు తోడ్పడవలెను.

పబ్లిక్‌ రోడ్డు, కాలువలు, పొతగట్లను నాశనము చేయు పశువులు.

11. 2[ పబ్లిక్‌ రోడ్డు, విహారస్థలములు, కాలువలు, మురుగు నీటి పారుదల నిర్మాణములు, పోతగట్లు మొదలగు వాటి భాద్యత వహించు వక్తులు మరియు పోలీసు అధికారులు అట్టి రోడ్లు స్థలములు, తోటలు కాలువలు, మురుగు నీటి పారుదల నిర్మాణ ములు. పొతగట్టు మొదలగు వాటినిగాని, అట్టి రోడ్ల, కాలువలు, మురుగు నీటి పారుదల నిర్మాణముల లేక పోతగట్ల ప్రక్కలను లేక సానువులనుగాని నాశనము చేయు చున్న లేక వాటిపై తిరుగాడుచున్న ఏవేని పశువులను అభిగ్రహణము చేయవచ్చును లేక అభి గ్రహణము చేయించవచ్చును.]

మరియు 3[వాటిని ఇరువది నాలుగు గంటల లోపల అత్యంత సమీపమునగల బందెల దొడ్డికి పంపవలెను, లేక పంపునట్లు చేయవలెను.]

బందెలొ పెట్టబడిన పశువులపై జుర్మాన.

12. 4[బందెల దొడ్డి రక్షకుడు, పైన చెప్పబడినట్లు బందెలో పెట్టబడిన ప్రతి యొక్క పశువునకు, ఈ విషయమై రాజ్యప్రభుత్వముచే అధికారిక రాజపత్రములొ అధిసూచన ద్యారా తత్సమయమున విహితము చేయబడియున్న స్కేలు ప్రకారము జుర్మానాను వసూలు చేయవలెను. వేరు వేరు స్థానిక ప్రాంతములకు వేరు వేరు స్కేళ్ళను విహితము చేయవచ్చును.

అట్టు వసూలు చేయబడిన జుర్శానాలన్నియు, రాజ్య ప్రభుత్వము నిర్ధేశించునట్టి అధికారి ద్యారా జిల్లా మేజిస్ట్రేటుకు పంపబడవలెను.]

జుర్మానాల మరియు మేత ఖర్చుల జాబితా,

జుర్మానాల మరియు పశువుల మేతకు మరియు నీటికి అగు ఖర్చుల రేట్ల జాబితాను ప్రతి బందెల దొడ్డ మీద గాని, దానికి దగ్గరగా గాని, సుస్పష్టముగా కనుపించు స్థలమునందు,పెట్టియుంచవలెను.

అద్యాయము--4

- పశువుల అప్పగింత లేక విక్రయము

స్వంతదారు, పశువులను క్ఞైయిముచేసి జుర్మానాలను, ఖర్చులను చెల్లించినప్పుడు ప్రక్రియ

13. బం దెలో పెట్టబడిన పశువుల సొంతదారుగాని అతని ఏజెంటుగాని హాజరై ఆ పశువులను క్లయిము చేసినచో,” అట్టి పశువుల విషయమున అయిన ఖర్చులను, జుర్యానాలను అతడు చెల్లించిన మీదట, బందెల దొడ్డి రక్షకుడు వాటిని అతనికి అప్పగించవలెను.

అ పశువులను వాపసు తీసికొనిక మీదట ఆ సొంత దారుగాని అతని ఏజెంటు గాని ఆ బం దెలదొడ్డి రక్షకునిచే ఉంచబడిన రిజిష్టరులో అవి ముట్టినట్లు సంతకము చేయవలెను.


1“ అనవసరమైన జాప్యము లేకుండా వాటిని తీసుకొనవలెను లేక తీసుకొనబడునట్టు చేయవలెను “కు బదులుగా 1891 లోని 1వ చట్టపు పరిచ్చేదను 8 ద్వారా ఉంచబడినది.

2 పరిచ్చేదము. 11 యొక్క వర్తింవునక్షై అడవులకు భారతీయ అడవుల చట్టము, 1927 (1927 లోని 17వ చట్టము). పరిచ్చేదము. 70, చూడుము. తైలుమార్గములకు భారతీయ రైలుమార్గముల చట్టము:1890 (1890 లోని 9వ చట్టము) ను చూడుము,

3. “అనవసర జాప్యము లేకుండా వాటిని తీసుకొనవలెను ”కు బదులుగా 1891లోని 1వ చట్టము, పరిచ్చేదము 4 ద్యారా ఉంచబడినవి.

4 మూల పరిచ్చేదము 12కు బదులుగా 1921 లొని 17వ చట్టము, పరిచ్చేదము 2 ద్యారా ఉంచబడినది. భారతీయ అడవుల చట్టము, 1927 (1927 లొని 17వ చట్టము ) యొక్క 71వ పరిచ్చేదములొ కూడా చూడుము


జుర్మానాల మరియు మేత ఖర్చుల జాబితా,

స్వంతదారు, పశువులను క్ఞైయిముచేసి జుర్మానాలను, ఖర్చులను చెల్లించినప్పుడు ప్రక్రియ