పుట:ది కేటల్ ట్రెస్‌పాస్ యాక్టు, 1871.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కర్తవ్యములు నిర్వర్తించని బందెల దొడ్డి రక్షకునికి శాస్తి.

27. ఎవరేని బందెలదొడ్డి రక్షకుడు 19వ పరిచ్చేదపు నిబంధనలకు విరుద్ధముగ పశువులను విడుదలచేసినచో లేక కొనుగోలు చేసినచో లేక అప్పగించినచో లేక ఏదేని బందెలో పెట్టబడిన పశువులకు చాలినంత మేత, నీరు పెట్టనిచో, లేక ఈ చట్టముచ్వారా అతనికి విధింపబడిన ఏవేని ఇతర కర్తవ్యములను నిర్వర్తించనిచొ, మెజిస్ట్రేటు సమక్షమున దోషిగా నేరనిర్జీతుడైన మీదట, అతడు దాయిజ్యాద్రీనుడై యుండు ఏదేని ఇతర శాస్తికి అదనముగా, ఏబది రూపాయలకు మించని జుర్మానాతో శిక్షింపబడవలెను.

అట్టి జుర్మానాలను ఆబందెలదొడ్డి రక్షకుని జీతములో నుండి మినహాయించుట ద్వారా వసూలు చేయవచ్చును.

పరిచ్చేదములు 25, 26, లేక 27ల క్రింద వసూలుచేయబడిన జుర్మానాల వినియోగము.

28. 25వ పరిచ్చేదము, 26వ పరిచ్చేదము లేక 27వ పరిచ్చేదము క్రింద వసూలు చేయబడిన జుర్మానాలన్నియూ పూర్షతఃగాని భాగతఃగాని నేరనిర్షయను చేయు మేజిస్ట్రేటు తృప్తి చెందునట్లుగా రుజువు చేయబడిన నష్టమునకు లేక దండుగకు పరిహారముగా వినియోగింప బడవచ్చును.

అధ్యాయము--7

నష్టపరిహారమునకై దావాలు

నష్ట పరిహారమునకై దావా చేయు హక్కు యొక్క వ్యావృత్తి

29. పశువుల అక్రమ ప్రవేశమువలన తన భూమిపై గల పైరుకు లేక ఇతర పంటకు నాశము కలిగిన ఏ వ్యక్తి నైనను నష్టపరిహారమునకై ఏదేని సమర్థ న్యాయస్టానములో దావా వేయుటను ఇందులోనిదేదియు నిపేధించదు.

30. నేరనిర్ణయము చేయు మేజిస్ట్రేటు యొక్క ఉత్తరువు ద్వారా ఈ చట్టము క్రింద ఏ వ్యక్తి కైనను చెల్లింపబడిన ఏదేని నష్టపరిహారము, అట్టి దావాలో నష్టపరిహారముగా అతనిచే క్లెయిము చేయబడిన లేక అతనికి ఇప్పించబడిన ఏదేని సొమ్మునుండి ముజరా చేయబడి మినహాయింపబడవలెను.

ఆధ్యాయము.___8

అనుపూరకములు

కొన్ని ఉద్యోగ కృత్యములను స్దానిక ప్రాధికారికి ఆంతరణ చేయుటకు మరియు రాబడుల మిగుళ్ళ ను స్థానిక నిధికి జమకట్ట వలెనని ఆదేశించుటకు రాజ్య ప్రభుమునకు అధికారము.

31. రాజ్య ప్రభుత్వము ఆయా సమయములందు ఆధికారిక రాజపత్రములో అధిసూచన ద్వారా___

(ఎ) తమ పరిపాలన క్రింద యున్నవనె, ఈ చట్టము అమలుజరుగుచున్న రాజ్య క్షేత్రములలోని ఏదేని భాగమునందలి ఏదేని స్థానిక ప్రాధికారికి, ఆ స్థానిక ప్రాధికారి అధికారితలోనున్న స్థానిక ప్రాంతములో ఈ చట్టము క్రింద రాజ్య ప్రభుత్వమునకు లేక జిల్లా మేజిస్ట్రేటుకు గల కృత్యములన్నింటినిగాని, వాటిలో దేనినై ననుగాని అంతరణము చేయవచ్చును.

(అనుసూచి) రద్దుచేయు. చట్టము 1938 (1938లొని 1వ చట్టము) ద్వారా రద్దు చేయబడినది.


1. పరిచ్చేదము 26 యొక్క చివరి పేరా 1914 యొక్క 10వ చట్టముచే రద్దు చేయబడినది.

2 అధ్యాయము 8 1891లొని 1వ చట్టము యొక్క 9వ పరిచ్చేదము ద్వారా చేర్చబడినది.

3.ఖండము (బి) పాక్టికముగా 1914లోని 10వ చట్టము ద్వారాను పాక్టికముగా అనుకూలానుసరణ ఉత్తరువు 1937 ద్వారాను రద్దు చేయబడినది.