పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46


అపరాధమును గూర్చిన సాక్ష్యమును అదృశ్యము చేయుట లేక అపరాధికి శిక్ష పడకుండ కాపాడుటకై తప్పుడు సమాచారము అందజేయుట.

201. అపరాధము చేయబడినదని తెలిసియుండియు లేక అట్లు విశ్వసించుటకు కారణముండియు, అపరాధికి శాసనవిహితమైన శిష్ట పడకుండకాపాడు ఉద్దేశముతో, ఆ అపరాధము చేయుటకు గూర్చిన సాక్ష్యమును దేనినై నన్న అదృశ్యముచేయు, లేక ఆ ఉద్దేశముతో ఆ ఆపరాధమునకు సంబంధించి తప్పుడుదని తనకు తెలిసినట్టి లేక తప్పుడు దని తాను విశ్వసించునట్టి ఏదేని సమాచారమును అందజేయు వారెవరైనను,

అపరాధము మరణశిక్ష విధింప దగినదైనచో.

చేయబడినదని అతనికి తెలిసినట్టి లేక అతను విశ్వసించుచున్నట్టి అపరాధము మరణదండనతో శిక్షింపదగిన దైనచో, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మా నాకు కూడ పాత్రులగుదురు;

యావజ్జీవ కారావావాసముతో శిక్షించ దగినదైనచో.

మరియు ఆ అపరాధము యావజ్జీవ కారావాసముతోనైనను, పది సంవత్సరముల దాక ఉండగల కారావాసముతోనైనను శిక్షింపదగినదైనచో, మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు;

పది సంవత్సరముల కంటే తక్కువదగు కారావాసముతో శిక్షింపదగినదైనచో.

మరియు ఆ అపరాధము, పది సంవత్సరములకంటే తక్కువదగు ఏ కాలావధిక కారావాసముతోనై నను శిక్షింపదగిన దైనచో, ఆ అపరాధమును గురించిన నిబంధనానుసారముగా గల దీర్ఘతను కారావాస కాలావధిలో నాలుగవ భాగము మేరకు ఉండగల కాలావధికి, ఆ అపరాధమునకు నిబంధనానుసారము ఏ రకపు కారావాసముగలదో ఆ రకపు కారావాసముతో నైనను, జుర్మానాతోనైనను, లేక ఈ రెండింటితోనైనను శిక్షింపబడుదురు,

ఉదాహరణము

'జడ్' ను 'బి' హత్యచేసెనని 'ఏ' కు తెలిసియుండి, 'బి' కి శిక్ష పడకుండ కాపాడవలెనను ఉద్దేశముతో శవమును దాచుటకు 'బి' కి 'ఏ' సహాయపడును. రెంటిలో ఒక రకపుదగు ఏడు సంవత్సరముల కారావాసమునకును, జుర్మానాకును 'ఏ' పాత్రుడగును.

అపరాధమును గూర్చిన సమాచారము అందజేయవలసిన వ్యక్తి సమాచారమును ఉద్దేశపూర్వకముగా అందజేయకుండుట.

202. అపరాధము చేయబడినదని తెలిసియుండియు, లేక అట్లు విశ్వసించుటకు కారణముండియు, ఆ అపరాధమును గూర్చి శాసనరీత్యా తాను అందజేయ వలసియున్న ఏ సమాచారమునైనను ఉద్దేశపూర్వకముగా అందజేయనివారెవరైనను, ఆరుమాసముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో నైనను, జుర్మానాతో నైనను, ఈ రెండింటితోనైనను శిక్షింపబడుదురు.

చేయబడిన ఆపరాధమును గూర్చి తప్పుడు సమాచారము నందజేయుట,

203. అపరాధము చేయబడినదని తెలిసియుండియు లేక అట్లు విశ్వసించుటకు కారణముండియు, ఆ అపరాధమును గూర్చి తాను తప్పుడుదని ఎరిగియున్నట్టి లేక తాను అట్టిదని విశ్వసించుచున్నట్టి ఏ సమాచారమునైనను అందజేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోనైనను, జుర్మానా తోనైనను, ఈ రెండింటితోనైనను శిక్షింపబడుదురు.

విశదీకరణము :--201 మరియు 202 పరిచ్ఛేదములలోను, ఈ పరిచ్ఛేదములోను, 'అపరాధము' ఆను పదపరిధియందు ఏకార్యము భారతదేశములో చేయబడియుండినచో ఈ క్రింది పరిచ్ఛేదములలో, అనగా 302, 304, 382, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 402, 435, 436, 449, 450, 457, 458, 459 మరియు 460 లలో, దేని క్రిందనైనను శిక్షింపదగియుండెడిదో అట్టి ఏకార్యమైనను భారత దేశము వెలుపల ఏ స్థలమునందు చేయబడినదైనను చేరియుండును.

సాక్ష్యముగ దాఖలు కాకుండ జేయుటకై దస్తావేజును నాశన మొనర్చుట.

204. ఒక న్యాయస్థానమునందుగాని ఒక పబ్లికు సేవకుని సమక్షమున గాని శాసనసమ్మతముగా జరుపబడు ఏదేని చర్యలో ఏ దస్తావేజును దాఖలు చేయవలసినదిగా తనను శాసన సమ్మతముగా బలవంత పెట్టవచ్చునో ఆ దస్తావేజు అట్టి న్యాయస్థానము యొక్క లేక అట్టి పబ్లికు సేవకుని యొక్క సమక్ష మున సాక్ష్యముగా దాఖలు చేయబడకుండ లేక ఉపయోగింపబడకుండ చేయు ఉద్దేశముతోగాని, అందు నిమిత్తమై దానిని దాఖలు చేయుటకు తాను శాసస సమ్మతముగా సమను చేయబడిన పిమ్మట, లేక దాఖలు చేయవలసినదిగా కోరబడిన పిమ్మటగాని, అట్టి దస్తావేజును దాచి పెట్టు లేక నాశనమొనర్చు లేక, అట్టి దస్తావేజునంతను, లేక అందలి ఏదేని భాగమును తుడిచివేయు లేదా చదువబడ జాలనిదగునట్లు చేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోనైనను, లేక జుర్మానాతోనైనను లేక ఈ రెండింటితోనైనను శిక్షింపబడుదురు.