పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13


ఉదాహరణము

'ఏ' ఒక చిన్న గొడ్డలితో పని చేయుచుండెను., గొడ్డలి చిప్ప ఎగిరిపోయి పక్కన ఉన్న మనిషిని చంపును. ఇచట 'ఏ' యందు తగు హెచ్చరిక కొరవడియుండనిచో, అతడు చేసిన కార్యము మన్నింపదగినదై యుండును, మరియు ఆది అపరాధము కాదు.

కీడు కలిగించగల దైనను, అపరాధిక ఉద్దేశము లేకుండ, ఇతరమైన కీడును నివారించుటకు చేసిన కార్యము.

31. కీడు కలిగించవలెనను అపరాధిక ఉద్దేశమేదియు లేకుండ, వ్యక్తికి గాని ఆస్తికిగాని ఇతరమైన కీడు నివారించు లేక తప్పించు నిమిత్తము సద్భావముతో ఒక పని చేయబడినచో, ఆ పని ఏదియు, కీడును కలిగించగలదను ఎరుకతో చేయబడినదను కారణమాత్రమున అపరాధము కాదు.

విశదీకరణము :- - - అట్టి సందర్భములో, ముప్పుతో కూడిన ఆ కార్యమును కీడు కలిగించగలదను ఎరుకతో చేయుట సమర్థనీయమై నదగుటకు లేక మన్నింపదగుటకు నివారింపవలసిన లేక తప్పించవలసిన కీడు స్వభావమును బట్టి యు, ఆసనృతను బట్టియు తగినంతదిగ యుండెనా అనునది ఒక సంగతిని గూర్చిన ప్రశ్న ఆగును.

ఉదాహరణములు

(ఏ) ఒక బాష్ప జలయానము యొక్క కెప్టెన్ అంగన 'ఏ' తన జలయానపు మార్గమును మార్చిననే తప్ప, తాను ఆ జలయానమును ఆపగలుగుటకు ముందే, ఇరువది లేక ముప్పది మంది ప్రయాణీకులు ఉన్నట్టి, 'బీ' అన్న పడవను అనివార్యముగ ఢీకొని ముంచివేయవలసినట్టియు, తన మార్గము మార్చుటద్వారా ఇద్దరు ప్రయాణీకులు మాత్రమే ఉన్నట్టిదై తాను బహుశా : తప్పుకొనగలుగునట్టి 'సీ' అను పడవను ఢీకొని ముంచివేయు ముప్పు కలిగించగలట్టియు పరిస్థితిలో అకస్మాత్తుగా తనవలన ఎట్టి తప్పిదముగాని, నిర్లక్ష్యముగాని లేకయే, చిక్కుకొనును. ఇచట 'సీ' లను పడవను ముంచి వేయు ఉద్దేశము లేకుండ 'బీ' అను పడవలోని ప్రయాణీకులకు అపాయము తప్పించు నిమిత్తము సద్భావముతో 'ఏ' తన మార్గమున మార్చినచో, తాను తప్పించ ఉద్దేశించిన ఆ అపాయము, 'సీ' అను పడవను ముంచివేయు ముప్పునకు అతడు గురిచేయుటను మన్నింపదగినంతదగు ఆపాయమేనని సంగతికి సంబంధించిన విషయముగా నిశ్చయింపబడినచో, తాను చేయుచున్న కార్యము వలన ఆట్లు జరుగగలదని ఎరిగి యుండియు, 'సీ' అను పడవను ముంచి వేసినప్పటికినీ, అతడు అపరాధము చేయలేదు.

(బీ) ఒక పెద్ద అగ్ని ప్రమాదములో మంటలు వ్యాపించకుండా చేయుటకు గాను ఇండ్లను 'ఏ' పడగొట్టును. అతడు సద్భావముతో మనుషులను లేక ఆస్తిని కాపాడవలెనను ఉద్దేశముతో ఈ పని చేయును. ఇచట నివారింపవలసిన కీడు యొక్క స్వభావమును బట్టియు, ఆసన్నతను బట్టియు, 'ఏ' యొక్క కార్యము మన్నింపదగినదని నిశ్చయింపబడినచో, ఏ అపరాది కాడు.

ఏడు సంవత్సరముల లోపు వయసుగల బిడ్డ చేసిన కార్యము.

82. ఏడు సంవత్సరముల లోపు వయస్సుగల బిడ్డ చేసినదేదియు అపరాధము కాదు.

ఏడు సంవత్సరములు దాటి పండ్రెండు సంవత్సరముల లోపు వయస్సుకలిగి అపరిపక్వ బుద్ధి గల బిడ్డ చేసిన కార్యము.

83. ఏడు సంవత్సరములు దాటి పండ్రెండు సంవత్సరముల లోపు వయసు గలిగి తాను దేనినై నను చేయ సందర్భము నందు తన ప్రవర్తన యొక్క స్వభావ పరిణామములను నిర్ణయించుకొనజాలునంతటి పరిపక్వమైన బుద్ది బలము లేనట్టి బిడ్డ చేసినదేదియు అపరాధము కాదు.

మతిస్తిమితములేని వ్యక్తి చేసిన కార్యము

84. దేనినైనను చేయు సమయమున మతిస్తిమితములేని కారణముగ, తాను చేయు కార్యము యొక్క, స్వభావమును గాని, తాను చేయుచున్నది దోషమని లేక శాసన విరుద్ధమని గాని, ఎరుగజాలని వ్యక్తి చేసినదేదియు అపరాధము కాదు.

తన ఇష్టమునకు వ్యతిరేకముగా మత్తు కలిగింపబడిన కారణమున వివేచన చేయజాలని వ్యక్తి చేసిన కార్యము.

85. దేనినైనను చేయు సమయమున మత్తెక్కిన కారణముగ తాను చేయు కార్యము యొక్క స్వభావమును గాని, తాను చేయు చున్నది దోషమని లేక శాసన విరుద్ధమని గాని, ఎరుగజాలని వ్యక్తి చేసిన దేదియు అపరాధము కాదు, అయితే, అతనికి మత్తెక్కించిన వస్తువు అతనికి తెలియకుండ, లేక అతని ఇష్టమునకు వ్యతిరేకముగ అతనికి ఈయబడి యుండవలెను.