పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1 కూట రచనకు శిక్ష.

465. కూటరచన చేయువారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

న్యాయస్థానపు రికార్డు లేక పబ్లికు రిజిస్టరు మొదలగువాటిని కూటరచన చేయుట.

466. ఒక న్యాయస్థానము యొక్క రికార్డుగ, చర్యగ, లేక న్యాయస్థానమునందలి రికార్డుగ, చర్యగ, లేక జననము, బాప్టి జము, వివాహము, లేదా ఖననములను గురించిన రిజిస్ట రుగ, లేక పబ్లికు సేవకుడు అట్టి పబ్లికు సేవకుడుగ ఉంచిన రిజిస్టరుగ లేక తన పదవీ హోదాలో పబ్లికు సేవకుడు ఇచ్చినట్లు తాత్పర్యమిచ్చు నట్టి సర్టిఫికెటుగ లేదా అట్టి దస్తా వేజుగ లేక దావా వేయుటకు గాని ఉత్త రవాదనచేయుటకు గాని అందులో ఏవేని చర్యలను నడుపుటకు గాని తీర్పును ఒప్పుకొనుటకు గాని, ఈయబడిన ప్రాధికారపత్రముగ, లేక ఒక ముక్త్యారునామాగ తాత్పర్యము నిచ్చు దస్తా వేజును కూటరచనచేయు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలా వధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విలువగల 'సెక్యూరిటీ, వీలునామా మొదలగు వాటిని కూటరచన చేయుట.

467. విలువగల సెక్యూరిటీగ, లేక వీలునామాగ, లేక పుత్రుని దత్తు చేసుకొనుటకైన ప్రాధికారపత్రముగ తాత్పర్యము నిచ్చు దస్తావేజునుగాని, విలువగల ఏదేని సెక్యూరిటీని ఇచ్చుటకు లేక బదిలీ చేయుటకు లేక దాని పై వచ్చే అసలును, వడ్డీని లేదా లాభాంశములను పుచ్చుకొనుటకు లేక ఏదేని డబ్బునై నను చరాస్తి నైనను విలువగల సెక్యూరిటీ నైనను పుచ్చుకొనుటకు లేదా అందజేయుటకు ఏవ్యక్తి కైనను ప్రాధికారమిచ్చు నదిగ తాత్పర్యమునిచ్చు దస్తా వేజును గాని డబ్బు చెల్లింపును ఒప్పుకొనుచూ ఇచ్చే చెల్లు చీటీగా లేక రసీదుగా, లేక ఏదేని చరాస్తి నై నను విలువగల సెక్యూటీనైనను అందజేసినందుకు చెల్లు చీటీగా లేక రసీదుగా తాత్పర్యమునిచ్చు ఏదేని దస్తా వేజును గాని, కూటరచనచేయు వారెవరైనను యావజ్జీవ కారావాసముతోగాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

దగా చేయుటకు కూటరచన.

468. దగాచేయుటకై ఉపయోగింపబడవలెనను ఉద్దేశముతో ఒక దస్తా వేజును కూటరచన చేయు వారెవరైనను ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకుకూడ పాత్రులగుదురు.

అపఖ్యాతి కలిగించుటకు కూటరచన,

469. ఎవరేని పక్ష కారునికి అపఖ్యాతి కలిగించవలెనను ఉద్దేశముతో గాని, ఆందునిమిత్తమై ఉపయోగింపబడగలదని ఎరిగి యుండిగాని ఒక దస్తావేజును కూటరచనచేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

కూటరచితమైన దస్తావేజు.

470. పూర్ణతః గాని, భాగతః గాని కూటరచన ద్వారా చేయబడిన తప్పుడు దస్తావేజు “కూటరచితమైన దస్తావేజు " అని పేర్కొనబడును.

కూటరచితమైన దస్తావేజును అసలైనదిగా ఉపయోగించుట.

471. కూటరచితమైన దస్తా వేజుని తాను ఎరిగియున్న లేక అట్లని విశ్వసించుటకు తనకు కారణమున్న ఏదేని దస్తావేజును కపటముతోగాని, నిజాయితీ లేకుండ గాని అసలైన దస్తావేజుగ. ఉపయోగించు నతడెవరైనను, తాను అట్టి దస్తావేజును కూటరచన చేసియుండిన ఎట్లో అదేరీతిలో శిక్షింపబడును.

467వ పరిచ్చేదము క్రింద శిక్షింపదగు కూట రచనను చేయు ఉద్దేశ్యముతో నకిలీ మొహరు మొదలగు వాటిని చేయుట లేక వాటిని స్వాధీనము నందుంచుకొనుట.

472. ఈ స్మృతియొక్క 467 వ పరిచ్చేదము క్రింద శిక్షింపదగునట్టి ఏదేని కూటరచనను చేయుటకై ఉపయోగింపబడవలెనను ఉద్దేశముతో ఏదేని మొహరునుగాని, ప్లేటునుగాని, ముద్రవేయు ఇతర ఉపకరణమునుగాని తయారుచేయు లేక దానిని నకిలీగాచేయు లేక అట్టి ఏదేని మొహరునుగాని, ప్లేటునుగాని, ఇతర ఉపకరణమునుగాని అది నకిలీదని ఎరిగియుండి అట్టి ఉద్దేశములో తన స్వాధీనములో ఉంచుకొను వారెవరై నను. యావజ్జీవ కారావాసముతో గాని, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

అన్యధా శిక్షింపదగు కూటరచన చేయు ఉద్దేశ్యముతో నకిలీ మొహరు మొదలగు వాటిని చేయుట, లేక వాటిని స్వాధీనము నందుంచుకొనుట,

473. ఈ అధ్యాయము యొక్క 467 వ పరిచ్ఛేదము క్రింద గాక ఏదేని ఇతర పరిచ్చేదము క్రింద శిక్షింపదగునట్టి ఏదేని కూటరచన చేయుటకై ఉపయోగింపబడవలెనను ఉద్దేశముతో ఏదేని మొహరునుగాని, ప్లేటునుగాని, ముద్రవేయు ఇతర ఉపకరణమునుగాని తయారుచేయు, లేక దానిని నకిలీగా చేయు, లేక అట్టి మొహరునుగాని, ప్లేటునుగాని ఇతర ఉపకరణమును గాని అది నకిలీదని ఎరిగియుండి అట్టి ఉద్దేశముతో తన స్వాదీనములో ఉంచుకొనువాడెవరైనను, యావజ్జీవ కారావాసముతోగాని, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.