పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

466వ లేక 467వ పరిచ్ఛేదములో వివరింపబడిన దస్తావేజు కూటరచన చేయబడినదని ఎరిగియుండి దానిని అసలైనదిగా ఉపయోగించు ఉద్దేశ్యముతో దానిని స్వాధీనము నందుంచుకొనుట.

474. ఏదేని దస్తావేజు కూటరచన చేయబడినదని ఎరిగి యుండి, కపటముతో గాని, నిజాయితీ లేకుండ గాని దానిని అసలైన దానినిగా ఉపయోగింపవలెనను ఉద్దేశముతో దానిని తన స్వాధీనములో ఉంచుకొను వారెవరైనను ఆ దస్తావేజు ఈ స్మృతియొక్క 466వ పరిచ్ఛేదములో పేర్కొనబడిన రకములలో ఏదియైనను అయినయెడల ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు, మరియు ఆ దస్తావేజు 467వ పరిచ్ఛేదములో పేర్కొనబడిన రకములలో ఏదియైనను అయినయెడల యావజ్జీవ కారావాసముతోగాని, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని, శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

467వ పరిచ్ఛేదములో వివరింపబడిన దస్తావేజులను అధి ప్రమాణీకరించుట కొరకు ఉపయోగింపబడు ఆకృతిలేక గుర్తును నకిలీగా చేయుట, నకిలీ గుర్తు వేయబడిన సామాగ్రిని స్వాధీనమునందుంచు కొనుట.

475. ఈ స్మృతియొక్క 467 వ పరిచ్ఛేదములో వివరింపబడిన ఏదేని దస్తా వేజును అధి ప్రమాణీకరించుట కొరకై ఉపయోగింపబడు ఏదేని ఆకృతిని లేక గుర్తును ఏదేని సామగ్రిమీదఅప్పుడే కూటరచనచేయబడిన, లేక ఆ తరువాత కూటరచన చేయబడనున్న ఏదేని దస్తావేజు అధిప్రమాణీకరింపబడినట్లు కన్పించునిమిత్తమై ఉపయోగింపబడవలెనను ఉద్దేశముతో, అట్టి సామగ్రిపై గాని అట్టి సామగ్రి యొక్క పదార్థములో గాని ఆ నకిలీ ఆకృతిని లేక గుర్తును వేయువారెవరైనను లేక అట్టి ఉద్దేశముతో అట్టి ఏదేని నకిలీ ఆకృతి, లేక గుర్తు దాని పైన వేయబడిన లేదా దాని పదార్థములో పూయబడిన ఏదేని సామగ్రిని స్వాదీనమునందుంచుకొన్నట్టి వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

467వ పరిచ్ఛేదముల వివరింపబడినవి కాక ఇతరమైన దస్తావేజులను అధి ప్రమాణీకరించుట కొరకు ఉపయోగింపబడు ఏదేని ఆకృతిని లేక గుర్తును నకిలీగా చేయుట, లేక నకిలీ గుర్తును వేయబడిన సామగ్రిని స్వాధినము నందుంచు కొనుట,

476. ఈ స్మృతి యొక్క 467వ పరిచ్ఛేదములో వివరించబడిన దస్తా వేదాలను కాక ఇతరమైన ఏదేని దస్తావేజును అధి ప్రమాణీకరించుట కొరకై ఉపయోగింపబడు ఏదేని ఆకృతిని లేక గుర్తును ఏదేని సామాగ్రి మీద అప్పుడే కూటరచవ చేయబడిన, లేక ఆ తరువాత కూటరచన చేయబడనున్న, ఏదేని దస్తావేజు అధి ప్రమాణీకరింప బడినట్లు కా విమిత్తమై ఉపయోగింపబడవలెనను ఉద్దేశముతో, అట్టి సామాగ్రి పై గాని అట్టి సామాగ్రి కొరకు ఉపయోగింపబడు యొక్క పదార్థములో గాని ఆ నకిలీ ఆకృతిని లేక గుర్తును వేయు వారెవరైనను అట్టి ఉద్దేశముతో అట్టి ఏదేవి నకిలీ ఆకృతిని ఆకృతి లేక గుర్తు దాని పై నవేయబడిన లేదా దాని పదార్థము లోన వేయబడిన ఏదేవి సామాగ్రిని స్వాధీనము నందుంచు కొన్నట్టి వారెవరైనను ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతొ శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

వీలునామాను, దత్తత ప్రాధికార పత్రమును లేక విలువగల సెక్యూరిటీని కపటముతో రద్దు చేయుట,నాశనము చేయుట మొదలగునవి.


477. వీలునామాగా, పుత్రుని దత్తు చేసికొను ప్రాధికారముగా, లేక ఏదేని విలువగల సెక్యూరిటీగా ఉన్నట్టి లేదా అట్లని తాత్పర్య మిచ్చునట్టి ఏదేని దస్తావేజును కపటముతొనై నను నిజాయితీ లేకుండనైనను, ప్రజలకు లేక ఎవరేని వ్యక్తి కి చెరువును లేదా హానిని కలుగజేయు ఉద్దేశముతోనైనను, రద్దు చేయు, నాశనముచేయు లేదా విరూపము చేయు లేక, రద్దు చేయుటకుగాని, నాశనము చేయుటకుగాని, విరూపము చేయుటకుగాని, ప్రయత్నించు, లేక దాచు లేదా దాచుటకు ప్రయత్నించు, లేక అట్టి దస్తావేజు విషయమున దుశ్చేష్ట చేయు వారెవరైనను యావజ్జీవ కారావాస ముతో గాని ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

లెక్కలను తారుమారు చేయుట.

477-ఏ. గుమాస్తాగా, అధికారిగా, లేక సేవకుడుగా ఉండిగాని, గుమాస్తాగా, అధికారిగా, లేక సేవకుడిగా నియోగింపబడియుండిగాని, ఆ హోదాలో వ్యవహారించుచుండిగాని, తన వియోజకునికి చెందినదగు, లేక అతని స్వాధీనములోనున్న, లేక తన నియోజకుని కొరకుగాని అతని తరఫున గాని తనచే స్వీకరింపబడిన ఏదేని పుస్తకమునకాగితమును, వ్రాత ప్రతిని, విలువగల సెక్యూరిటీని, లేక ఖాతా లెక్కను బుద్ధి పూర్వకముగను, కపటమునకు గురిచేయు ఉద్దేశముతోను నాశనము చేయు, మార్పుచేయు, అసమగ్రముచేయు,లేక తారుమారు చేయునతడెవరైనను బుద్ధిపూర్వకముగను, కపటమునకు గురిచేయు ఉద్దేశముతోను, ఏదేని అట్టి పుస్తకములో, కాగితములో, వ్రాత ప్రతిలో విలువగల సెక్యూరిటీలో లేదా ఖాతా లెక్కలో ఏదేని వివరమును తప్పుడు నమోదుచేయు, లేదాచేయుటకు దుష్ప్రేరణ చేయు, లేక ఏదేని ముఖ్య వివరమును లోపింపజేయు, మార్పుచేయు, లేదా లోపింపజేయుటకు గాని, మార్చుటకుగాని దుష్ప్రేరణచేయు నతడెవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

విశదీకరణము:-- ఈ పరిచ్ఛేదము క్రింద చేయబడు ఏదేని ఆరోపణములో కపటమునకు ఏ వ్యక్తిని గురిచేయు ఉద్దేశముఉండెనో ప్రత్యేకముగా పేర్కొనకుండ, లేక ఎంత మొత్త మును గూర్చి కపటమువకు గురిచేయ ఉద్దేశముండెనో, లేదా అపరాధము ఏదినమున చేయబడెనో ప్రత్యేకముగా నిర్ధిష్ట పరచకుండ, కపటమునకు గురి చేయవలెనను సాధారణ ఉద్దేశము ఉండెనని చెప్పినచాలును.