పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్థలి నొరగంగ నేసిన యథాయథలై' గిరిశాసనాదిది
క్తలధరణీశితల్ చనిరి తారక లెల్లెడ జారె నయ్యెడన్.

27


క.

గిరిచరసేనల యారా
నెరసర్ల నిజాస్త్రధార నిశ్చలగతిచే
ధర ద్రెళ్లనేసి దశకం
ధరతనయఖరారి యార్చె దశదిశ [1]లదరన్.

28


వ.

అంత.

29


తే.

తిరిగి నిజరాజధానికి నఱిఁగి తండ్రి
కా జయక్రియ లెరుక సేయంగ నలరి
శక్రజిత్ఖచరారికి సరసకనక
శాటిక లలంక్రియల్ దెచ్చి చాల నిచ్చె.

30


వ.

అంత నిక్కడ.

31


సీ.

కన దస్త్రధార ద్రెళ్లిన యందఱఁ గాంచి
             యార్తిచే ఋక్షస్థిరాధినేత
తారాతనయకీశ దశకంఠదాయి రా
             క్షసకర్త యనసి నల్టాడ లరసి
యంజనానందనహరిఁ జేరి కీర్తించి
             ధనదాశ కేఁగి యాదారి కలశ
జలరాశి చెంగటఁ జంద్రాద్రిఁ గని దాని
             సంగడి గిరి గాంచి సారశక్తి
దనరఁగా శల్యకరణి సంధానకరణి
యాదియైన క్రియల్ దెచ్చి యఖిలశైల
చారిరేఖల రానెలసర్ల లెస్స
గాఁచి రక్షించరాదె యగణ్యచరిత!

32
  1. లగలన్ (ము)