పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లారటితదేహియై త్రిద
శారాతిశ్రేణిఁ గలసి హళహళిచేతన్.

20


క.

అతికాయాదినిశాచర
తతి ననిచిన నేఁగి కలన దశరథతనయా
యతకాండాసనకాండా
హతిఁ ద్రెళ్లి దిశాధికర్త లలరఁగ నంతన్.

21


చ.

ఘనదశకంధరాజ్ఞ నతిగాఢరతిన్ హరిజిత్ఖరారి చ
య్యన హయదంతిసైనికశతాంగహళాహళికల్ నిశాటనా
ధనికరసాట్టహాసనినదక్రియ లెల్లెడ నిండిరాగ రా
చనెలలఁ దాకినంతటనె చండరణస్థలి యయ్యె నయ్యెడన్.

22


క.

ధృతి దాశరథి సదాగతి
హితదత్తశరాసనాస్త్రహృద్యతరరథ
క్షితి నిలిచి నింగి జలధర
తతి యండగ నెరసి చాల తహతహ లెసఁగన్.

23


ఆ.

కలయనాటిరేయి కటికిచీఁకటిఁ జేసి
జలధరాళియండ చక్క నిలిచి
కానరాక చండకాండధారలచేత
హరి నిశాటఘటల యరటడంచె.

24


చ.

అసదృశదాసకంఠఘనహస్తశరాసనశస్త్ర(ధారచే)[1]రాజిచే
నెసఁగఁగ చిత్తజ ల్లనఁగ [2]నేసినదానికి తాళలేక రా
క్షసతతి లంకదారిఁ జనసాగె హరీశిత లెన్న కానకే
నసి జెడి దైత్యహంతకడఁ జక్కఁగఁ డాగిరి జాలి నయ్యెడన్.

25


వ.

[3]అది గాక.

26


చ.

కలన నగారి [4]జిద్దితిజకర్త శనైశ్చరధారచేత రా
నెలల నశేషకీశతతి నెట్టన నిద్రలఁ జెందినట్టిలా

  1. 'శి' యందును గలదు.
  2. జేసిన (ము)
  3. 'శి' లో లేదు.
  4. జద్దితిజ (ము)