పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఈరీతి కార్యసరణిఁగాఁ జేయ నీచేతనేగాని యన్యసాథ్యచికిత్స గాదని
యనేకచర్యలఁ గీర్తించిన సంతసిల్లి దాని కంగీకరించి.

33


క.

ఆఋక్షనగాగ్రణి యా
జ్ఞారతిచే ననిలజాద్రిచారి ధనదధి
క్షీరజలరాశిదారిం
దారాస్థలి కెగసి చనియె ధైర్యస్థితిచేన్.

34


క.

అగచారికర్త నింగికి
నెగసి సరగజలధిరేఖలెల్లఁ గడఁచి చం
ద్రగిరిం గని యాచెంగటి
తగిన శిఖరిఁ జేరనేఁగెఁ దహతహచేతన్.

35


క.

ఏదారి శల్యసంధా
నాదికరణఘటనగాక యనిలజహరి యా
హ్లాదక్రియచే గిరిని య
నాదరగతి [1]కేలఁ దిగిచి యందినయంతన్.

36


చ.

కని ధృతి నడ్డగట్టిన ఖగచ్ఛటల న్నలిఁ జేసి యేఁగి చ
య్యన గిరి కేల దాలిచి నయక్రియ సంధిల నాజి ధిక్కరిం
చిన రజనీచరేశితల చండదిగంతనరేంద్రజాతకీ
ర్తన లలరంగ దెచ్చె దృఢధైర్యజయాతిశయస్థితిం దగన్.

37


వ.

అంత.

38


ఆ.

దాశరథిని యతనిదాయిహరిశ్రేణి
నహహ తెచ్చినట్టి యద్రిచేత
దీక్షఁ జేసి లెస్స రక్షించె నంజనా
జాతకీశనేత సాటి గలరె.

39


వ.

అయ్యెడ.

40
  1. జేల(ము)