పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర నరిగె కాంచనాసన ధరన్ దనరారినయట్టి కైకనీసీ
తనయ నిశాచరాగ్రణి నధఃక్రియచే గని నిల్చె నిల్చినన్.

66


వ.

ఇట్లు నిలిచిన యంగదహరిం గాంచి లంకానేత యాగ్రహించి[1]

67


క.

నీ యాఖ్యన్ [2]నీజనయిత
నీ యేలిక, నీచరిత్ర, నీసంస్థలి, య
త్యాయతగతిచే దెలియం
జేయం గదరా! యటన్నఁ జెదరక యాడెన్.

68


ఉ.

ని న్నని గెల్చి తెచ్చి చెఱనించిన క్షత్రియకర్తఁ జేరి కే
లన్నిటిఁ జెండిరాల్చిన ధరాదితిజాగ్రణి, యడ్డకట్టనన్
జెన్నడగించినట్టి జగబెట్టి, రసాతనయాధినేతచే
నెన్నికఁగన్న దాసకరి నే నెఱిఁగించెద నాలకించరా.

69


క.

సారతరశక్తి నిన్నా
కారాగృహధాత్రి నడ్డకట్టిన ఘనశై
లారాతిజాతహరి దా
నారయ నాతండ్రి యంగదాఖ్య నలరితిన్.

70


క.

ఏ నెఱిఁగించిన జాడ, ద
శానన కాఁ జేసితేని యఖిలశ్రీసం
తానహితదైత్యసంతతి
కానందక్రీడ గాదె యది యెట్లన్నన్.

71


ఉ.

ఆనరనాథకేసరి దయానిధిగాన నిశాచరేంద్ర! నె
య్యాన గణించి ని న్నరయ నంచిన నీ కిట దేహరక్షగా
నే నెఱిఁగించి శీఘ్రగతి నేఁగితి నాచనినట్టిదానికిన్
జానకి నిచ్చి ధాత్రి సిరి సంధిల హెచ్చఁగరాదె యన్నిఁటన్.

72


క.

తెచ్చిన దానికి గ్రక్కున
నిచ్చిన యది లెస్స, సీత నీలేనియెడన్

  1. .... గ్రహించి నల్దిశల్ గలయ నిరీక్షించి (శి)
  2. నిన్జనయిత (ము)