పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జెచ్చెఱ సంగరధరణిం
గ్రచ్చఱ నిల్చిన నది నీతి గాదే తెలియన్.

73


సీ.

అల్క [1]తాటకఁ గెల్చి యతి యష్టి రక్షించె
             శిల నాతిగాఁ జేసె, చిత్తజారి
ఘనశరాసనయష్టి గండ్రించె, రాజారి
             దండి యడంగించెఁ, దల్లి యాజ్ఞ
కాన కేఁగి నిశాటకాంత నాసిక గీసె,
             నని ఖరాదిఖలసంహతి నడంచె
శాక్రి ఖండించె, హెచ్చఁగ నార్కిఁ దయనేలె,
             కంనిధి గట్టించె గట్లచేతఁ
దరలి నీచాయి యాతనిదండ జేరి
లంకచెంగట నిల్చె నేశంక లేక
యట్టి జగదేకకర్త [2]సీతాధినేత
జడత నరలీలఁగా దలంచంగ నేల.

74


చ.

ఘనఖరరాక్షసారికరకాండధృతాశనిచండసాయకా
సనదృఢశింజినీగళితసాయక కీలి దశాస్య ! నీ నరా
శనతతి కాననచ్ఛటలు స్రగ్గగజేయని యాది నేధరా
తనయను నీతి నిచ్చి సిరిఁ చాలిచి హెచ్చఁగరాదె యన్నిటన్.

75


అని యాడిన నంగదహరిఁ
గని దశకంధరనిశాటకర్త హృదయసం
జనితాగ్రహకాలానల
ఘనకీలన్ నింగి నిండఁగాఁ దెగి యాడెన్.

76


చ.

ధరచరహీన! నీజయితం [3]దెగటార్చగఁ జేసినట్టి
శరధి జయించలేని యది జాలదె, చాలక యాతనిగాని సి
గ్గరయఁగలేక నల్దిశల యంత దలార్చి హరించ దాసతం
దిరిగితి, యాశ్రయించ జగతీస్థలి లేరె నరేశితల్ గనన్.

77
  1. తాటక దెల్చి(ము)
  2. సీతాధినేత(శి) నరాధినేత (ము)
  3. దెగటారగ (ము)