పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాలయధాత్రి డించిన నగాహితనందనకీశసేతఁ దా
లీల హరించె, నాతనికి లే రిక సాటి జగత్త్రయిం గనన్.

59


క.

నీసరిజేజేలెల్లన్
సీసీయనఁ జిన్నదాయిచెల్లెల్ గదియన్
నాసిక [1]గీలించె, ఖలా
గ్రేసరఖరచారణారి గీటణఁగించెన్.

60


ఆ.

ఏ నెఱింగినంత నెరుకగా జేసెద
నియతి నాలజించి నేర్చెదేని
జనకతనయ నిచ్చి శరణన్నదే లెస్స
గాని యన్యచింతఁ గనఁగ నేల.

61


క.

అని యాడినట్టి తాతన్
గనదాగ్రహదృష్టిచేత గడకనిచి, దశా
నననిర్జనారి నిజహిత
జనసంగతి నధికనీతి సంధిల నిలచెన్.

62


వ.

అంత నక్కడ.

63


ఉ.

[2]కంగక తా దయాజలధి గాన ధరాతనయాధినేత, యా
చెంగట నిల్చినట్టి హరిసేనల నేరల నడ్డసేయకే
[3]యంగదకీశక ర్త నతిహర్షగతిం గని చీఱి యన్నిఁటన్
సంగతి నాచరించి దృఢసాహసచర్య గణించి నీతిచేన్.

64


ఆ.

అనఘ లంక కేఁగి యాదశాస్యనిశాటకర్త కధికనీతికార్యచర్యఁ
దెలియఁజేయ లెస్స, తెలియని నాటికి
తిరిగిరాగరాదె తీక్ష్ణసరణి.

65


చ.

అని ఖరరాక్షసారి దయనాడినయాజ్ఞఁ దలన్ ధరించి, చ
య్యన హరి[4]కర్త లంక కతిహర్షరసస్థితి సంధిలంగ చే

  1. గోయించె (శి.గ)
  2. కంగదతా(ము)
  3. అంగదకీశకర్త (ము)
  4. లంకకర్త కతి (శి)