పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జనకకన్యాకాంత తనచీరగండ్ర చే
             ఘనతరాలంక్రియల్ గట్టి యిచట
నేసె నేసినయది యిన్నాళ్లదనుక నీ
             చరిసంది దాచితిఁ జాడ దెలియ
నని తరలి దాని దెచ్చి ఖరారిచెంత
నిడిన గన్నీటిజడిచేత నెల్లయంగ
యష్టి తడియంగ నిలజారి లేచి తక్కి
చెంత తనదాయి లాలించ శాంతిఁ జెందె.

81


వ.

ఇట్లు శాంతిఁ జెందిన దాశరథిం గాంచి యార్కి యిట్లనియె.

82


ఆ.

ఇంత చింతఁ గలఁగ నేటికి నాకాంక్ష
జేరి సంఘటిల్లఁజేసితేని
యర్ధఘటిక నీహితార్థక్రియల్ [1]సేయ
గలనయా ఖరాంతకక్షితీశ!

83


క.

తారాసతి నాకడ కే
తేరంగాఁ గాంచి శాక్రి దృఢగతి గిష్కిం
ధారాజ్యకర్తయై తన
రారె నతనిసాటిసేయ జగతిం గలరే.

84


తే.

ఆవకాఖ్య గలిగినట్టిఖగారాతి
సంహరించి యంఘ్రి సంహరించి
నికటశిఖరి దాటనేసె నాశాక్రిచే
శక్తి గణనసేయఁజాల ననఘ.

85


క.

ఈడనరాని దృఢక్రియ
దశరథ రాజనందన చరిత్ర
నేడింటన్ దాడిచెట్ల నేకాకృతిగా
క్రీడతలల్ కరశాఖల్
గేడించి గ్రహించె శాక్రికిన్ సరిగలరే.

86
  1. సేతు (ము)