పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అనినం దరహాసయుతా
నన కంజారాతికిన్ ఘనశ్రీ లెచ్చం
దిననాథజ హరి నేతన్
గని తేనెల్ జిల్క నాడె గాదిలిసేతన్.

87


చ.

అనఘా! నీయెదఁ జింతసేయఁ దగదే నా నిర్జరాధీశనం
దనకీశాగ్రణి [1]గాలకాశనటనన్ నారాచధారాహతిన్
గనెలై త్రెళ్లఁగ నేన యేసినకడన్ గారాన నీతార నీ
కనతఖ్యాతి ఘటిల్లనిచ్చి హరిరాజ్యశ్రీల నేలించెదన్.

88


ఆ.

అంగజారియైన నచలాధరారాతి
యైన స్రష్టయైన నడ్డగించ
సాగిరేని శాక్రి జక్కాడకే చన
నిట్టి సందగాన నెరుఁగరాదె.

89


క.

అని యార్కి చెంతరాగా
జని త్రెళ్లిన నిర్ణరారిచరణనఖరసం
జ్ఞ నెగురగీటెన్ హరినం
దనహరికన్నాన క్షాత్రతరనయశక్తిన్.

90


వ.

అది గడచి.

91


ఉ.

ఎన్నికఁ దాడిచెట్లకడ కేఁగి ధరాతనయాధినేత య
చ్ఛిన్నశరాసయష్టి నరిఁ జేరిచి కీలికరాళశస్త్రిచే
నన్నిఁట గండ్రలై ధరణి నంటఁగ నేసె దిశల్ చలించఁగా
గిన్నరసిద్ధసాధ్యఖగఖేచరకీర్తన లెచ్చ నయ్యెడన్.

92


క.

తనకట్టిదె నాదశరథ
తనయాగ్రణి నడక సాటి దాకిన నిననం
దనహరి యలరి తదాజ్ఞం
జని శాక్రిన్ జేరి యుద్ధసన్నద్ధగతిన్.

93
  1. కాలక + ఆశ - 'క' స్వార్థము