పుట:దశకుమారచరిత్రము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

దశకుమారచరిత్రము

     వాసంబున కరిగి యందు సర్వార్థసిద్ధిమిత్తంబు విత్తంబ కా
     విచారించి.52
సీ. భవదనుగ్రహమునఁ బడసిన సాధక
                    త్వమునకు సత్క్రియాదక్షు లైన
     శిష్యుల సవరించి సిద్ధాంజనము గూర్చు
                    కొని వింధ్యవనమధ్యమునకు నరిగి
     పాడుపోళ్ళ[1]ం జొచ్చి బహువిధనిధినూచ
                    కము[2]లకు ధరణీరుహములవలనఁ
     గందువ లెఱిఁగి రక్షకులఁ గొందఱఁ జేసి
                    [3]కొందఱు తోడుగా గుద్దలించి
తే. పెన్నిధులు గాంచి [4]వెరవునఁ బెల్లగించి
     కోటిసంఖ్యలమాడలు గూడఁబోయు
     నవసరంబున నొక్కసా తరుగుదెంచి
     రవము మిగులంగ ననతిదూరమున విడిసె.53
ఆ. అందులోనఁ [5]బేరు నలపడ్డయెడ్లనుఁ
     దడవి విలిచి తెచ్చి ధనము వట్టి
     యొండుసరకుపేర నుగ్గడించుచు నల్లఁ
     జేరి నేర్పుగలుగువారిఁ గలసి.54
క. ఆవీటికిఁ బతియును సం
     భావితుఁడును నైన చంద్రపాలుఁడు మిత్రుం
     డై వేడుకతోఁ దోకొని
     పోవఁగ నుజ్జయిని కేను బోయితిఁ బ్రీతిన్.55

  1. వసించి
  2. లగుఫలభూ
  3. గొండలుపిండిగా
  4. వఱపున
  5. బండి కలవడ్డ