పుట:దశకుమారచరిత్రము.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330

దశకుమారచరిత్రము

     సైన్యంబుల విడియించి యమ్మునీంద్రునకుం దనరాక యెఱిం
     గించి[1].82
తే. తాను బ్రియయునుఁ జెలులు నందలము లెక్కి
     యాశ్రమమునకు లలి దొలకాడఁ జేరి
     వేడ్కయును గౌరవంబును విస్మయంబు
     నెడఁ బెనంగొన మునిశిష్యు లెదురుచనఁగ.83
వ. వారల నెడనెడ సంభావింపుచు రాజవాహనమహీవల్ల
     భుండు పల్లవతోరణసంఫుల్లప్రసూనప్రాలంబమాలాసము
     ల్లసితంబైన మునిపల్లియఁ దఱియం జని యటమున్న [2]యుట
     జ(ంబులం దపోధను లిఱ్ఱులతోఁ) గూడ నఱ్ఱు లెత్తి చూచు
     చుండ వారికిం గట్టెదు రగుటయు శిబికావతరణంబు సేసి.84
ఆ. చెలులు సందడించి కెలనఁ బిఱుందను
     బొదివి య(రుగు దేరబోయి తల్లిఁ
     దండ్రి ఋషిని జూచు తమకంబు గ) దుర (న
     య్యాశ్రమస్థలంబు) నతఁడు సేరి.85
క. వసుమతికి రాజునకుఁ దా
     పసముఖ్యునకుం గ్రమమునఁ బ్రణమిల్లిన
     రసదృశహర్షభరితమా
     నసు లై గరువంబు దీవెనలు ముందరగాన్.86
చ. పులకలు సమ్మదాశ్రువులుఁ బొందఁగ నాతనిఁ గౌఁగిలించి నె
     చ్చెలులు వినీతి మ్రొక్క సవిశేషమనఃప్రమదంబుతోడ వా
     రల గ్రమవృత్తి గాఢపరిరంభము సేసి తదీయవక్త్రము
     ల్గలయఁగఁ జూచుచుం బ్రచురగౌరవసంభృతవత్సలాత్ములై.87

  1. పుచ్చి
  2. యుటజంబులగుండ వఱ్ఱులెత్తి