పుట:దశకుమారచరిత్రము.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

328

దశకుమారచరిత్రము

     మెలమి గద్దియ డిగి యెదురేఁగుదేర
     మ్రొక్కి రవనీతలంబునఁ [1]జక్కఁ జాఁగి.71
వ. ప్రణమిల్లిన భూవల్లభుండు సంభ్రమంబున నెత్తి కౌఁగిలిం
     చుకొని సోమదత్తపుష్పోద్భవులనుం దక్కటి చెలులనుం
     బరస్పరసాదరపరిరంభణంబు సేసినయనంతరంబ రత్నో
     ద్భవాదులకుఁ గామపాలప్రహారవర్ముల నెఱింగించి వీరలను
     వారలను నపహారవర్మప్రముఖసఖులకు రత్నోద్భవుం జూపి
     యన్యోన్యసముచితప్ర(సంగంబు నడిపి) సింహాసనాసీనుం డై
     సపరిచరగణంబుల(కు మణిమ)యాసనంబు లొసంగి బహు
     మానంబుగా మానసారు రావించి వలపటం బ్రహారవర్మా
     సనసమానంబున నునిచి.72
తే. హర్ష మెడ నిండి మోమున నలువు వెడలు
     కరణిఁ జెలువొంద లోచనకాంతివూర
     మల్ల నిగుడ వసుంధరావల్లభుండు
     సోమదత్తుఁ బుష్పోద్భవుఁ జూచి యపుడు.73
క. తనచరితము మిత్రుల వ
     ర్తనమును సంక్షేపవృత్తిఁ దగఁ జెప్పి ముదం
     బునఁ బుష్పోద్భవునకుఁ ద
     జ్జన[2]పదవివిధాధికారసంపద లిచ్చెన్.74
వ. ఇచ్చి యతని సకలకార్యంబులకుం జాలించి బంధుపాలు
     రావించి యాలింగనసముచితాసనప్రదానాదుల సంభా
     వించి సగౌరవంబుగా సంపద్విశేషప్రయోజకులం గావించి
     యనంతరంబ.75

  1. ముందుఁ
  2. పతి