పుట:దశకుమారచరిత్రము.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

దశకుమారచరిత్రము

     పదేశాధీశుండును బహుగోసాయపారిణుండును నగు
     వసంతభానుం డను రాజునమాత్యుం డింద్రపాలితుండనువాని
     తనయుండు గూఢకృత్యపాటవపారీణుండు చంద్రపాలితుం
     డనువాఁడు పతియనుమతంబునం దనకపటనీతిప్రయోగం
     బునకు వలయుపరివారంబును దానునుం దండ్రి వెడల
     నడిచిన వచ్చినవాఁ డై విదర్భనగరంబున కరుగుదెంచి విహార
     భద్రుంగని యతండుం గార్యసహాయుండు గా ననంత
     వర్మం గొలిచి.107
క. నూతనకేలీవిరచన
     చాతుర్యంబున మనఃప్రచారానుగతిం
     బ్రీతికరుం డై యాదు
     ర్జాతుం డవనీశుఁ దనవశంబుగఁ జేసెన్.108
వ. ఇట్లు పరమాప్తుం డై యాయాసచ్ఛేదనస్నేహత్వంబును
     మేదోహీనతయును [1]నుత్ఖాతనపరత్వదేహంబును నాదిగాఁ
     గలకొన్నిగుణంబు లగుట చూపి మృగయావ్యాపారంబుల
     యందును నిపుణతాప్రకటంబునుం జతురకాలయాపనంబును
     ధనాగమంబును నాదిగాఁ గల కొన్నిగుణంబు లగుట చూపి
     దురోదరక్రీడలయందును నారోగ్యంబును వీరరససంధుక్ష
     ణంబును సౌమనస్యంబును ధాతువృద్ధియు నాఁ దగు
     కొన్నిగుణంబు లగుట చూపి మద్యప్రకారంబులయందును
     నంగరాగమాల్యాభరణమాంగల్యంబును ననితరసులభా
     నందంబు నాదిగాఁ గొన్నిగుణంబు లగుట చూపి యంగనా
     సంగమవిహారంబులయందునుం [2]గుతూహలంబుఁగా జేయుచు

  1. నుద్ధావన
  2. గుతూహలింగాఁ