పుట:దశకుమారచరిత్రము.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

దశకుమారచరిత్రము

     దే నియమించి చూచుచుఁ దదీయవిధానము లాచరించుచున్.35
తే. బ్రహ్మరాక్షసుఁ డింతిపైఁ బాయకున్న
     మంత్రవాదుల వెదకుచు మందు లెఱుఁగు
     వారిఁ దడవుచుఁ గనుకలి వంతఁ జింత
     నొంది యిడుమలు గుడుచుచు నున్నవాఁడు.36
వ. అనిన విని యిది యంతయుఁ గనకరేఖకపటం[1]బుగా నెఱింగి
     యాత్మగతంబున.37
క. యువతీరత్నము చెలువున
     దవిలి వివేకంబుచొప్పు దప్పిన జయసిం
     హవిభునిఁ గుటిలోపాయత
     నవశ్యముం జెఱుతు నే ననాయాసమునన్.38
వ. అని నిశ్చయించి సముచితసల్లాపంబుల వెండియుం గొండొక
     సేపు గడపి యాజియ్య వీడ్కొని యరిగి యాకారంబు
     వే ఱగునట్లుగా నైపుణ్యంబునం దాపసవేషంబు దాల్చి
     కొందఱు శిష్యులం గూర్చుకొని యేనును వారునుం బర
     మాస్తికజనమధ్యంబున సుఖుల మై నడచి యంధ్రనగరంబు
     చేరువకరిగి తత్ప్రదేశంబున నొక్కకొలనికడం బర్ణశాలఁ
     గావించుకొని యందు వసియించి.39
క. నైష్ఠికభావన వివిధా
     నుష్ఠానంబుల మహీజనులు మేడ్పడ ధ
     ర్మిష్ఠాధిష్ఠుఁడ నగుచుఁ బ
     టిష్ఠుఁడ నై సలిపితిం గడిఁది యగుభంగిన్.40

  1. బని యె