పుట:దశకుమారచరిత్రము.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

293

వ. అట్టియెడ మదీయశిష్యులు పురంబునం గలయ మెలంగి.41
ఆ. ఇతఁడు పూర్వమునుల కేమిటఁ దక్కువ
     యతులబోధమున మహానుభావుఁ
     డద్భుతావహంబులైన శాపానుగ్ర
     హంబు లరయ నితనియందుఁ గలవు.42
క. పెక్కెడలఁ జూచితిమి మే
     మక్కజముగ వీరిఁ గొలిచి యభిమతసిద్ధిం
     గ్రక్కునఁ బడయుదు రీక్రియఁ
     ద్రక్కొని ఘటియించె నీచదశ నొందంగన్.43
వ. అనుచు మఱియు ననేకప్రకారంబుల నన్నుం బ్రశంసించుచు
     మత్పరత్వసకలజనసమానీతసమస్తవస్తువు లనుభవించుచు
     నేను సమలోష్ఠకాంచనత్వంబు భావించుకొని యున్నం
     గర్ణపరంపరాప్రాప్తంబైన యస్మదీయవిఖ్యాతివిశేషంబునకు
     బేలువడి భూపాలుండు నాకడకుం జనుదెంచి దండప్రణా
     మంబు చేసి చేతులు మొగిచి నిలిచి.44
క. మునినాథ! నీమహత్త్వము
     విని యభిమతసిద్ధి వడయు వేడుకతోడం
     జనుదెంచితి ననుఁ గరుణం
     గనుఁగొను మని వినయనమ్రగాత్రుం డయ్యెన్.45
వ. ఏనును వానికొలంది యెఱింగి తద్గుణకథనంబు నెపంబుగా
     మదీయవర్తనంబందు గురుత్వబుద్ధి పుట్టింపందలంచి యిట్లంటి.46
మ. బహుదేశంబులు [1]చొచ్చుచున్ బహుతపఃప్రౌఢిం బ్రతిష్టించుచున్
     బహుతీర్థంబుల కేగుచున్ బహుగుణభ్రాజిష్ణులం జూచుచున్

  1. చూచుచున్