పుట:దశకుమారచరిత్రము.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

271

     ప్తలలితనాముం డొక్కఁడు
     కులతిలకం బనఁగఁ జాలు కూఁతుం గాంచెన్.113
వ. కని రత్నావతి యను పేరు పెట్టి బలభద్రుం డనం బరఁగిన
     సెట్టి కిచ్చిన వాఁడును వేశ్యాసక్తుం డగుట దాని నుదాసీ
     నంబు సేసిన నాబాలయు జననీగృహంబునకుం జని దు
     ర్భాగ్యానుగుణంబుగా జనులన లన నింబవని యను నా
     మంబు దాల్చి [1]పతిపాదచింతాక్రాంత యై యున్నం గొం
     డొకకాలంబునకు.114
క. ఒక ప్రోడముండి తనపా
     లికి నేకత మరుగుదెంచి లీలాశూన్యాం
     కకముఖి యై యి ట్లునికికి
     నకటా! కత మేమి? యనిన నది యి ట్లనియెన్ .115
ఉ. పేర్కొ ని తల్లిదండ్రులకుఁ బెంపుగఁ బుట్టితిఁ బుట్టి యెంతయుం
     గర్కశుఁడైన కాంతునకుఁ గర్మవశంబున నాల నైతి నా
     కోర్కుల మీఁదఁ దీర్తు నని ఘోరనికారము లోర్చుచున్నచో
     మార్కొని మాలదైవము క్రమంబున నన్నెడసేసె వానికిన్.116
శా. తల్లీ! ప్రాణముతోడిచావు మగఁడున్ దవ్వైన నిల్లాలికిం
     దల్లిం దండ్రిని జేరి యున్కి దలఁపన్ దైన్యంబు నాభర్త న
     న్నొల్లం బొమ్మని ద్రోచెఁ బ్రాణవిరహోద్యోగక్షమం బందె నా
     యుల్లం [2]బింతలు పెద్దలే నరులు దైవోపేక్షఁ జింతిల్లరే!117

  1. పరివాద
  2. బింతులు వొందరే నరుల