పుట:దశకుమారచరిత్రము.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

దశకుమారచరిత్రము

క. తొడవులు దొడుగుచుఁ బువ్వులు
     ముడుచుచుఁ దిలకంబు లొప్పముగఁ బెట్టుచుఁ బొ
     ల్పడరఁగఁ బూఁతలు పూయుచు
     మడుఁగులు గట్టుచుఁ గడంగి మగువలు ప్రీతిన్.7
క. ఉత్సవము తెఱం గై సం
     పత్సదృశాచరణవిభవపరిణతిమై న
     త్యుత్సుకతం గ్రెసేసిరి
     మాత్సర్యాన్వితములైన మాటలతోడన్.8
వ. వారం జూచుచుఁ జను సమయంబున.9
మ. తనశృంగారము దాన కైకొనుచు నుత్సంగస్థవీణామృదు
     ధ్వనితోఁ గూడఁగఁ బాడి పాడి తెలివొందం దన్నుఁ దా మెచ్చుచున్
     జనసమ్మర్దముదిక్కు చూచుచుఁ బిశాచగ్రస్తసంకాశుఁ డై
     యనురాగంబునఁ బొందుచుండె నొకఁ డేకాంతప్రదేశంబునన్.10
వ. వాని డాయం బోయి యీయుత్సవంబునకుం బే రెద్ది కార
     ణం బెయ్యది? యుత్సవానుత్సుకుండ వై యేకాంతంబునందుఁ
     దంత్రీనినాదంబు వినోదంబుగా నీ యున్న తెఱం గేమి?
     యెఱింగింపు మనిన వాఁ డి ట్లనియె.11
చ. శుభచరితాభిశోభితుఁడు [1]సుహ్మమహీపతి తుంగధన్వుఁడన్
     విభుఁ డభిరామరాజ్యపదవీకలితుం డయి తాను నన్యదు
     ర్లభసుఖ మందియుం దనయలాభము లేమికిఁ గంది యాత్మస
     ద్విభవము నిష్ఫలం బని మదిం దలపోసి గురుండు పన్పఁగన్.

  1. ఇచట 'శూరమహీపతి దన్మతన్వయా' యని యుండ “సుహ్మపతి స్తుంగధన్వానామ' అను మూలమునకు విరుద్ధముగా నున్నందున సవరింపఁబడినది.