పుట:దశకుమారచరిత్రము.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

213

శా. నిత్యస్తుత్యవిలాససారకవితానిర్మాణచాతుర్య! సం
     ప్రత్యగ్రేసరభూసురప్రకరశుంభత్ప్రీతిధాత్రీశదా
     నత్యాగప్రథమానకీర్తిలతికానందాగ్రశాఖాచయా
     దిత్యానోకహమత్సరోదయ! కృతార్థీభూతసంపన్నిధీ!164
క. విద్యానికషోపల! ధ
     ర్మోద్యోగనిరూఢమానసోల్లాస! రుచి
     [1](ప్రద్యోతన! సంపద్విభ
     వద్యోరాజప్రమాణ! ప్రాజ్ఞధురీణా!)165
మాలిని. (పరమకరుణభావా! భారతామ్నాయసేవా
     దరణ! వితరణాంభోధారణా)ధఃకృతాంభో
     ధర! (యనుపమభద్రీ! ధైర్య)జాంబూనదాద్రీ!
     పరిగత (నయసూత్రా! భాసురామాత్యపాత్రా!)166
గద్యము. ఇది సకలసుకవిజనప్రసాదవిభవ విలస దభినవదండి
     నామధేయవిఖ్యాత కేతనార్యప్రణీతం బైన దశకుమార
     చరిత్రం బను మహా కావ్యంబునందు సప్తమాశ్వాసము.

  1. 165–166 పద్యములలోని కుండలీకృతభాగములు వ్రాఁతప్రతిలో శిథిలము లగుటంచేసి పూరింపఁబడినవి.