పుట:దశకుమారచరిత్రము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

అప్పటికళింగనగరము కళింగదేశమునకు రాజధాని యనియు దానిని కర్దనుఁడు పాలించుచున్నాఁ డని తెలుపఁబడినది. పరిశోధనదృష్టితోఁ జూచితిమేని కళింగరాజులకుఁ జాళుక్యులకు జరిగిన యుద్ధము దశకుమారచరిత్రములోని మంత్రగుప్తునికథవలన మనకుఁ దెలియఁగలదు.

కేతనకవి సుప్రసిద్ధుఁడు దిక్కనసోమయాజికాలమునాఁటివాఁడు గావున కవికాలనిరూపణమున నంత శ్రమపడవలసిన పని యుండదు. తిక్కనసోమయాజి మనుమసిద్ధియాస్థానమున నుంటవలనను మనుమసిద్ధి నెల్లూరు రాజధానిగఁ జేసికొని ఆంధ్రదేశభాగమును గణపతిదేవునకు సామంతుఁడై పాలించియుంటవలనను సమకాలికుఁ డగు కేతనయు క్రీ. శ. 1200 మొదలు 1280 లోఁగ జీవించియుండును.

దశకుమార చరిత్రము 1901 లోఁ బ్రచురించిరి. ప్రతు లచిరకాలమునఁ జెల్లిపోయెను. పలువురు కేతనకవితామృతముఁ జవిజూడ నెంచి నిరాశావశులు గావలసివచ్చినది.

భ్రష్టభాగములఁ బూరించుటలో మాతృకాభావములు చాలవఱకు సమర్థింపఁబడినవి గాని