పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

బోయర్ యుద్ధం


తెలివిగా వ్యవహరించడమే గాక చేంబర్లేన్ కోరికను మన్నించి కోటీశ్వరులందరికీ ఉరిశిక్ష రద్దుచేయడమే గాక వారందరినీ క్షమించి వదిలివేశాడు

ఉబ్బరం చేసిన ఉదరంలో తిన్నతిండి ఎంతసేపు యిముడుతుంది ? కక్కు ద్వారా బయటికి పోవలసిందే కదా డా॥ జెమిసన్ వ్యవహారాన్ని చక్కదిద్దినా యిది కేవలం ఒక ప్రయత్నం మాత్రమే, కాని దీని వెనుక తన ఎడ అసంతృప్తి అధికంగా ఉన్నదని క్రూగరుకు తెలుసు జోహన్స్‌బర్గు కోటీశ్వరులు తాత్కాలికంగా దెబ్బతిన్నా వూరుకోరని, సమయం చిక్కినప్పుడు చావు దెబ్బ తీస్తారని అతడికి తెలుసు డా జెమిసన్ ఏ సంస్కరణలకోసం యింత పనిచేశాడో వాటిలో ఒక్కటికూడా అమలు కాలేదు. కనుక కోటీశ్వరులు శాంతి పహించడం సాధ్యమా? అదీగాక వాళ్ల కోరికలు నెరవేరాలనిజోహన్స్‌బర్గులో గల బ్రిటిష్ హైకమీషనరు డాల్డ్‌మిల్సిర్ కోరుతున్నాడు. చేంబర్లెస్ డా॥జెమిసస్ మరియు బ్రిటిష్ కోటీశ్వరుల యెడ క్రూగర్ చేసిన మేలును ప్రశంసిస్తూనే వాళ్లు కోరిన సంస్కరణలు అమలు చేయడం అవసరమని కూడా ప్రకటించారు. యుద్ధం తప్ప యీ సమస్యను పరిష్కరించుటకు మరో మార్గం లేదని అందరూ అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ కోటీశ్వరుల కోరికలు నెరవేరిస్తే ట్రాన్స్‌వాల్‌నందలి బోయర్ల ప్రభుత్వం తొలిగిపోకతప్పదు. దీనికి పరిష్కారం యుద్ధమే గనుక రెండు పక్షాలు యుద్ధానికి సిద్ధపడి పని ప్రారంభించాయి. రెండు పక్షాల శబ్ద యుద్ధం బ్రహ్మాండంగా జరగసాగింది. క్రూగరు యుద్ధ సామగ్రి తెప్పించగానే బ్రిటిష్ హైకమిషనరు ఆ ప్రయత్నాన్ని ఖండించి, బ్రిటీష్ ప్రభుత్వం కూడా యిట్టి పనిచేస్తుందని హెచ్చరిస్తూండేవాడు ఈ విధంగా యిద్దరి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభమైందనే చెప్పవచ్చు

ఇక క్రూగర్ ఆగలేకపోయాడు ఆగితే శతృవుల వలలో బడినట్లేనని భావించాడు. బ్రిటిష్ సామ్రాజ్యం దగ్గర సైన్యం బలం, అర్ధబలం అన్నీ వున్నాయి. అది క్రూగరును మాటిమాటికీ హెచ్చరిస్తూ బ్రిటిష్ కోటీశ్వరులకోరికలను నెరవేర్చమని ప్రకటిస్తూ, క్రూగరు లక్ష్యం చేయడంలేదనే భావం ప్రపంచ ప్రజలకు కలిగేలా చేసి చివరికి యుద్ధం ప్రకటిస్తుందని