పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

77


ఎదుట అనుభవంలేని బోయర్ రైతులు ఏమీ చేయలేరని అనుకున్నారు జోహన్సుబర్గునందలి ఎక్కువ మంది ప్రజలు తమకు స్వాగతం పలుకుతారని భావించి మూడో తప్పు చేశారు. వాళ్ల ఆశలేమీ ఫలించలేదు. ప్రెసిడెంట్ క్రూగరుకు జరుగుతున్న కుట్ర అంతా తెలిసిపోయింది. కడు రహస్యంగా జాగ్రత్తగా లోలోపల ఆతడు సైన్యాన్ని అప్రమత్తం చేసి సిద్ధంగా వుంచాడు యీ కుట్రలో పాల్గొన్న వాళ్లందరినీ నిర్బంధించుటకు కూడా ఏర్పాట్లన్నీ చేసి వుంచాడు డా. జెమిసన్ మనుష్యులు జోహన్సుబర్గు చేరేలోపునే తుపాకులతో క్రూగర్ సైనికులు వాళ్లను ఎదుర్కొన్నారు. అంత సైన్యం ఎదుట డా॥ జెమిసస్ దళం నిలవలేకపోయింది. జోహన్సు బర్గులో ఎవ్వరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి వీలులేకుండా కూడా క్రూగర్ ఏర్పాట్లు చేశాడు. అందువల్ల ఒక్కడు కూడా ఎదుర్కొడానికి సాహసించలేదు క్రూగర్ చేసిన ఏర్పాట్లు చూచి జోహన్స్‌బర్గ్ నందలి కోటీశ్వరులంతా నివ్వెరబోయారు యీ కారణాన్నంటివల్ల తిరుగుబాటును విఫలం చేయుటకు అధికంగా ధనం ఖర్చు చేయవలసిన అవసరం కలుగలేదు ప్రాణనష్టం కూడా బహుతక్కువగా జరిగింది.

డా॥ జెమిసస్, అతని మిత్రులు, గనుల యజమానులు కొందరు నిర్బంధించబడ్డారు. కేసులు నడిచాయి. కొందరికి ఉరిశిక్షలు పడ్డాయి. అపరాధుల్లో ఎక్కువ మంది కోటీశ్వరులే అందువల్ల బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఏ విధమైన సహాయం చేయలేక పోయింది పట్టపగలు వాళ్లు తిరుగుబాటుకు పూనుకోవడమే అందుకు కారణం దానితో ప్రెసిడెంట్ క్రూగర్ పేరు ప్రతిష్ఠలు పెరిగిపోయాయి. అధినివేశాల రాజ్యాల మంత్రి శ్రీ ఛేంబర్లేన్ దీనాతిదీనంగా ఒక తంతిక్రూగరుకు పంపాడు. శ్రీ క్రూగర్ యొక్క దయాగుణాన్ని ప్రశంసించి, బ్రిటిష్ కోటీశ్వరులను రక్షించమని ప్రార్థించాడు పందెం వేయడంలో క్రూగర్ ప్రజ్ఞాశాలి దక్షిణాఫ్రికాయందలి ఏ పక్షమూ తన ఆధికారం కాజేయలేదనే విశ్వాసం బాగా అతడి మనస్సులో నాటుకుంది డా॥ జెమిసస్ అతడి మిత్రులు గొప్ప పని చేశామని భావించారే కాని సరిగా వ్యవహరించక పోవడం వల్ల గట్టి దెబ్బతిన్నారు. ఈ వ్యవహారంలో క్రూగర్