పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

79


క్రూగరు గ్రహించాడు. తమ బలం అధికం కనుక క్రూగరు తలవంచి తీరతాడని బ్రిటిష్ వాళ్లకు తెలుసు అయితే బోయర్లు కూడా సామాన్యులుకారు 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల ప్రతి బోయర్ పురుషుడు యుద్ధం చేయగలడు బోయర్ స్త్రీలు కూడా నిర్ణయానికి వస్తే యుద్ధంలో పాల్గొని పోరాటం సాగించగలరు. అక్కడి ప్రజల దృష్టిలో జాతీయ స్వాతంత్ర్యం ఒక మత స్వాతంత్ర్యమే అట్టిబోయర్లు బ్రిటిష్ సామ్రాజ్యం ముందు తలవంచుతారా? ఇదీ అక్కడి పరిస్థితి

ఆరెంజ్‌ఫ్రీస్టేట్స్ ప్రెసిడెంట్ క్రూగర్ ఆదివరకే రాజీపడ్డాడు. ఈ రెండు బోయర్ ప్రభుత్వాల విధానం ఒక్కటే బ్రిటిష్ వారికోరికల్ని గని యజమానులైన బ్రిటిష్ కోటీశ్వరుల కోరికల్ని పూర్తిగా అంగీకరించడం ప్రెసిడెంట్ క్రూగరుకు యిష్టంలేదు. కనుక యుద్ధం తప్పదు. అయితే సమయం గడిచిన కొద్దీ బ్రిటిష్ సామ్రాజ్యానికి బలం పెరిగిపోతుంది కనుక అతడు తన అభిప్రాయాన్ని బ్రిటిష్ హైకమీషనరుకు తెలిపి ట్రాన్స్‌వాల్, ఫ్రీస్టేట్‌ల సరిహద్దుల దగ్గర సైన్యాన్ని మొహరించాడు. ఇక యుద్ధం తప్ప మరోమార్గం లేని స్థితి ఏర్పడింది. ఇట్టి బెదిరింపుకు బ్రిటిష్ సామ్రాజ్యం తలవంచడమా? క్రూగర్ అల్టిమేటమ్ గడువు పూర్తి కాగానే అతడి సైన్యాలు ముందుకు సాగాయి. లేడీస్మిధ్, కింబర్లీ, మెఫేకింగ్‌లను చుట్టుముట్టాయి. ఈ విధంగా 1899లో యుద్ధం ప్రారంభమైంది. బోయర్ యుద్ధంలో బ్రిటిష్ వారి కోరికల్లో ఒకటి అక్కడ నివసిస్తున్న భారతీయుల స్థితిలో మార్పు అవసరమనునదీ ముఖ్యమైనదే

ఇక దక్షిణాఫ్రికా యందలి భారతీయులు మనం ఏం చేయాలనే సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది బోయర్ పురుషులంతా సంగ్రామంలో పొల్గొనుటకు వెళ్లిపోయారు. వకీళ్లు వకీలు వృత్తిమానివేశారు. రైతులు వ్యవసాయం మానివేశారు. వ్యాపారులు వ్యాపారం మాని వేశారు. నౌకర్లు నౌకరీ వదిలివేశారు. ఇంగ్లీషు వాళ్ల పక్షాన అంతమంది లేకపోయినా కేప్ కాలనీ, నేటాలు, రొడీషియాలలో గల సైన్యంలో చేరని ప్రజలు పెద్ద సంఖ్యలో వాలంటీర్లుగా చేరారు నేను పని చేసే కోర్టులో వకీళ్లు బాగా