పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

భారతీయులు ఏం చేశారు? -2


కనబడని గట్టి దెబ్బ తగలడం వల్ల నరాలు బాగా పీకుతున్నాయి. ఇంకా నాకు విశ్రాంతి తీసుకునే అదృష్టం కలుగలేదు. బయట రుస్తుంగారి యింటిని తెల్లవాళ్లు వేలాదిమంది చుట్టముట్టారు. రాత్రి కావడంవల్ల లుచ్చాలు, లఫంగాలు కూడా వారిలో చేరిపోయారు నీవు వెంటనే గాంధీని మాకు అప్పగించు లేకపోతే అతడితోబాటు, నిన్ను. నీ యింటిని, నీ కొట్టును తగలేస్తాం అని తెల్లవాళ్లు రుస్తుంగారికి వార్త పంపించారు. అయితే రుస్తుంజీ ఎవ్వరికీ భయపడేరకం కాదు. ఈ విషయం తెలియగానే పోలీసు సూపరింటెండెంటు తమ సి ఐ డి విభాగం అనుచరులతో అక్కడికి వచ్చి జనంలో కలిసిపోయారు. ఒక చెంచీ వేయించుకొని దాని మీద నిలబడి జనంతో మాట్లాడుతూ తెలివిగా రుస్తుంజీ యింటి ద్వారం వద్దకు చేరుకున్నారు ఆ విధంగా గేటు వారి ఆధీనంలోకి వచ్చింది. లోపలికి ఎవర్నీ జొరబడనీయకుండా జాగ్రత్త పడ్డారు. తన అనుచరుణ్ణి పిలిచి వెంటనే ముఖానికి రంగు వేసుకొని భారత వ్యాపారి దుస్తులు ధరించిలోనికి వెళ్లి గాంధీకి తను చెప్పిన సమాచారం అందజేయమని చెప్పాడు. అతడు లోనికి వచ్చి నన్ను కలిశాడు. "నీ ప్రాణం, నీ కుటుంబ సభ్యుల ప్రాణం, రుస్తుంజీ ఆస్థిని రక్షించతలుచుకుంటే తక్షణం వేషం మార్చుకొని కానిస్టేబుల్ దుస్తులు ధరించి మా మనిషితోబాటు క్రిందికి వచ్చి జనాన్నుంచి తప్పించుకొని బయటికి వెళ్లిపో రోడ్డు కొసన మీకోసం కారు రెడీగా వుంది. దానిలో కూర్చొని పోలీసు స్టేషను చేరి సురక్షితంగా వుండండి లేని యెడల యిక్కడ కాల్పులు జరుగుతాయి ఈ జనాన్నిఆపడం కష్టం నా మాటవిని తక్షణం దుస్తులు మార్చుకొని బయటపడండి" అని సూపరింటెండెంట్ చెప్పమన్న సమాచారం ఆ అధికారి నాకు చెప్పాడు నేను స్థితిని గ్రహించాను భారతీయ కానిస్టేబుల్ దుస్తులు ధరించాను రుస్తుం యింటినుండి బయటికి వచ్చి, ఆ పోలీసు ఆఫీసరు వెంట సురక్షితంగా పోలీసు స్టేషను చేరాను ఈ లోపున సూపరింటెండెంట్ అలెగ్జాండర్ పాటలు పాడి, హాస్యంగా మాట్లాడి జనాన్ని కొద్ది సేపు ఆపి వుంచాడు. నేను పోలీసు స్టేషనుకు సురక్షితంగా చేరానని తెలియగానే జనాన్ని యిలా అడిగాడు