పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

69

"మీకు ఎవరు కావాలి? "

"మాకు గాంధీ కావాలి"

"గాంధీ దొరికితే ఏం చేస్తారు?"

"తగల పెడతాం"

"ఆయన ఏం చేశాడని తగల పెడతారు ?"

“మమ్మల్ని గురించి ఇండియాలో చాలా అబద్దాలు చెప్పాడు. భారతీయుల్ని తీసుకు వచ్చి నేటాలును నింపివేయాలని భావిస్తున్నాడు "

"గాంధీ బయటికి రాకపోతే ఏం చేస్తారు "

"ఈ యింటిని తగలబెడతాం"

ఇంట్లో స్త్రీలు, పిల్లలు వున్నారు. (గాంధీ భార్య పిల్లలు వున్నారు. ) స్త్రీలను, పిల్లలను కూడా కాల్చి చంపుతారా? సిగ్గులేదా?"

"అందుకు మీరే బాధ్యులు అంతకంటే మరో మార్గం లేకుండా మీరు చేస్తున్నారు. మరెవ్వరి మీద మేము చెయ్యి చేసుకోము గాంధీని మాకు అప్పగించండి చాలు గాంధీని మాకు అప్పజెప్పకుండా ఎవరినొ చంపుతారా, సిగ్గులేదా? అని మీరు మమ్మల్ని అడగడం ఏమిటి ?"

సూపరింటెండెంట్ చిరునవ్వు నవ్వుతూ మీ మధ్యనుంచి యిప్పుడే గాంధీ వెళ్ళిపోయారు. గదా! ఇక ఎం చేస్తారు. అని జనాన్ని అడిగాడు జనం ఎగతాళి చేస్తున్నాడని భావించి అబద్ధం, శుద్ధ అబద్ధం అని అరిచారు అలెగ్జాండరు. "మీరు మీ యీ వృద్ధ సూపరింటెండెంట్ మాటల్ని నమ్మకపోతే ఒక పనిచేయండి మీలో ముగ్గురు నలుగురు ఒక కమిటీగా ఏర్పడి లోనికి వేళ్ల వెతికిరండి మీ కమిటీ మెంబర్లకు యింట్లో గాంధీ దొరక్కపోతే మీరంతా యిక్కడినుంచి వెళ్ళిపోవాలి అలా అయితేనే మెంబర్లను లోనికి పంపుతాను మీరు యివాళ ఆవేశపడి పోలీసు శాఖ మాట వినలేదు. దానివల్ల పోలీసుల గౌరవం పోలేదు, కాని మీ గౌరవం పూర్తిగా పోయింది. అందువల్ల పోలీసులు గాంధీని మీ మధ్యనుంచే తీసుకొని వెళ్లిపోయారు. మీరే ఓడిపోయారు అందుకు పోలీసులు ఏం చేస్తారు? పోలీసుల్ని నియమించింది. మీరేకదా! అందువల్ల పోలీసులు తమ కర్తవ్యం నెరవేర్చారు. జరిగింది యిదీ"