పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

67


దగ్గరికి వచ్చి గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. కాళ్లతో తన్నాడు. నా కళ్లు గిర్రున తిరిగిపోయాయి. పడిపోతుండగా నాకు అక్కడేవున్న యింటిగేటు చువ్వ చేతి కందింది. అక్కడ కొంచెం శ్వాస పీల్చుకున్నాను. కొద్ది సేపటికి తెలివివచ్చింది. బయలు దేరాను ప్రాణాలతో యింటికి చేరతాననే ఆశ పూర్తిగా పోయింది. అయితే అప్పుడు కూడా నన్ను కొడుతున్న తెల్లవారు దోషులనే భావం నాకు కలగలేదు బాగా జ్ఞాపకం వున్నది

ఇట్టి ప్రమాదస్థితిలో నేను నడుస్తూ వుండగా యింతలో అటునుంచి వెళుతున్న పోలీసు సూపరింటెండెంట్ భార్య నా ఎదురుగా వచ్చింది మేమిద్దరం ఒకరినొకరు చూచుకున్నాం ఆమె బాగా పరిచితురాలే ఆమె ధైర్యవంతురాలు ఆకాశం మేఘావృతంగా వున్నది. సూర్యుడు అస్తమిస్తున్న సమయం ఆమె వెంటనే తనగొడుగు విప్పి నాకు కప్పి తను నా ప్రక్కన నడవసాగింది. ఒక మహిళను, అందులోను డర్బన్ పోలీసు సూపరింటెండెంటు భార్యను, తెల్లవాళ్లు అవమానించలేరు. ఆమెను కొట్టలేరు. అందువల్ల ఆమెను దాటి నాకు తగిలే దెబ్బలు తగ్గాయి. ఈ విషయం పోలీసు సూపరింటెండెంటు గారికి తెలిసింది . మీ రక్షణ కోసం పోలీసుల దళాన్ని ఆయన వెంటనే పంపించాడు. వాళ్లంతా వచ్చిరాగానే నన్ను చుట్టి వేశారు మా త్రోవ పోలీసు స్టేషను దగ్గరగా వెళుతుంది. అక్కడికి చేరేసరికి పోలీసు సూపరింటెండెంటు మా కోసం ఎదురు చూస్తూ నిలబడియున్నారు. పోలీసు స్టేషనులో నన్ను ఆగమన్నాడు. ఆయనకు ధన్యవాదాలు తెలిపి నేను వెంటనే యింటికి చేరుకోవాలి. డర్బన్ ప్రజలకయొక్క న్యాయప్రవృత్తి మీద, నా సత్యం మీద నాకు విశ్వాసం వున్నది. మీరు నా రక్షణకోసం పోలీసు దళం పంపించారు. అందుకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాను శ్రీమతి ఎలిగ్జాండరు నన్ను రక్షించారు" అని అన్నాను

అప్పటినుంచి నాకు ఎక్కువ శ్రమకలుగలేదు. రుస్తుంగారి యింటికి చేరుకున్నాను ప్రొద్దుగూకింది. మేర్‌లాండుఓడకు సంబంధించిన డాక్టరు దాజీ జర్‌జోర్ అక్కడ నాకోసం సిద్ధంగా వున్నారు. నాకు చికిత్స ప్రారంభించారు నాకు తగిలిన గాయాల్ని పరీక్షించారు. పెద్దగా గాయాలు తగలలేదు. కాని