పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

భారతీయులు ఏం చేశారు? -2


వాణ్ణి. పెద్దవకీలుగా వారికే పని అప్పగించేవాణ్ణి ఆయన సాహసి మంచి ఒడ్డుపొడవుగల మనిషి

మేము నడుస్తున్న రోడ్డు డర్బను పట్టణానికి సంబంధించిన పెద్ద పేటలో నుంచి వెళుతుంది మేము సాయంత్రం 4 గంటలకు బయలుదేరాము. ఆకాశంలో మేఘాలు క్రమ్మి వున్నాయి అవి సూర్యుణ్ణి కప్పివేశాయి కాలినడకన రుస్తుం గారింటికి చేరడానికి ఒక గంట సమయం పదుతుంది ఓడనుంచి దిగంగానే కొంతమంది తెల్లజాతి పిల్లలు మమ్మల్ని చూచారు పెద్ద వయస్సు వాళ్లు ఎవ్వరూలేదు. ప్రత్యేకరకం తలపాగా ధరించాను. కనుక పిల్లలు నన్ను గుర్తు పట్టారు. "గాంధీ" గాంధీ" పట్టుకోండి, పట్టుకోండి, తన్నండి, తన్నండి అంటూ మమ్మల్ని చుట్టి వేశారు. కొంతమంది పిల్లలు రాళ్లు విసరడం ప్రారంభించారు. యింతలో మధ్య వయస్కులు కూడా వచ్చారు. మెల్లమెల్లగా దాడిచేసే జనం పెరిగిపోయారు. నడిచివెళ్లితే ప్రమాదం తప్పదని గ్రహించి శ్రీ లాటిన్ రిక్షాను పిలిచాడు. రిక్షా అంటే మనిషిలాగే చిన్న బండి అన్నమాట నేను ఎన్నడూ రిక్షా ఎక్కలేదు. మనిషిలాగే రిక్షా ఎక్కడం సరికాదని నా అభిప్రాయం కాని యిప్పుడు తప్పదు రిక్షా ఎక్కడమే ధర్మమని భావించాను భగవంతుడు రక్షించదలిస్తే పిడుగులుపడ్డా పరవాలేదు ఆను సూక్తిజ్ఞాపకం వచ్చింది. ఆరు ఏడు సార్లు నా జీవితంతో యిటువంటి ప్రాణాపాయం కలిగించే పరిస్థితులు వచ్చాయి. అయినా రక్షణ పొందాను అది నా ప్రతాపం కాదు, భగవత్ప్రతాపమే దక్షిణాఫ్రికాలో రిక్షాలు లాగేవాళ్ళంతా హబ్షీలే తెల్లవాళ్లు ఆ రిక్షావాణ్ణి యీ మనిషిని రిక్షా ఎక్కించుకున్నావంటే చావకొడతాం, రిక్షా విరగకొడతాం అని భయపెట్టారు. అందువల్ల రిక్షావాడు ఖా (వద్దు) అంటూ పారిపోయాడు నేనురిక్షా ఎక్కలేకపోయాను

ఇక నడిచివెళ్లాల్సిందే మరో మార్గం లేదు. మేము ముందుకు సాగేకొద్దీ తెల్లవాళ్ల గుంపు పెరిగిపోసాగింది. మేమిద్దరం వెస్ట్ స్ట్రీటులో అడుగుపెట్టాం ఒక బలిష్ఠుడైన తెల్లవాడు శ్రీ లాటిన్‌ను చేతులతో ఎత్తుకు పోయాడు నేనొక్కడినే మిగిలాను రాళ్లు, రప్పలు ఏదిబడితే అది నాకు తగలసాగాయి తలపాగా తీసి ఎవరోవిసిరిపారేశారు. ఇంతలో ఒక తెల్లజాతి బలిష్ఠుడు నా