పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

49


నుంచి భారతీయుల్ని లోనికి రానీయరని, టిక్కట్లు తీసుకునే చోట కూడా యిబ్బందులు తప్పవని చెప్పారు. ఆ రాత్రికి వచ్చిన రైల్లో నేను ప్రిటోరియాకు బయలు దేరాను నేను చేసుకున్న నిర్ణయం గట్టిదో ఓటిదో తేల్చుకోవాలని అంతర్యామి యగు పరమేశ్వరుడు పూర్తిగా నన్ను పరీక్షించాడు. ప్రిటోరియా చేరే లోపున యింకా అవమానాలు సహించవలసి వచ్చింది. దెబ్బలు, తన్నులు తినవలసి వచ్చింది. అయితే యివన్నీ నా నిర్ణయానికి బలం చేకూర్చాయి

ఈ విధంగా 1893 లో అనుకోకుండా నాకు దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారతీయుల దుస్థితిని చూచి స్వయంగా ఆనుభవించి తెలుసుకునే అవకాశం లభించింది. అవకాశం దొరికినప్పుడు ప్రిటోరియాలో గల భారతీయులతో యీ విషయం చర్చించాను వారికి పరిస్థితిని తెలియజేశాను అంతకంటే మించి నేను ఏమీ చేయలేదు. దాదా అబ్దుల్లా గారి కేసును గురించి పని చేయడం. దక్షిణాఫ్రికా యందలి భారతీయుల కష్టాలు తొలగించుపనిచేయడం యీ రెండూ ఒకేసారి చేయడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చాను. రెండుపనులు ఒకేసారి చేయడమంటే రెండిటినీ చెడగొట్టడమే అవుతుంది. 1894వ సంవత్సరం వచ్చింది. ఒక్క సంవత్సరం గడిచిపోయింది. అబ్దుల్లా గారికేసుకూడా పూర్తి అయింది. నేను డర్బన్ తిరిగి వచ్చాను. భారత దేశం వచ్చి వేయుటకు సిద్ధమయ్యాను దాదా అబ్దుల్లో నా కోసం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరో నా చేతికి "నేటాల్ మెర్క్యురీ" అను పత్రికను అందించారు. ఆ పత్రికలో నేటాలు అసెంబ్లీలో జరిగిన చర్యల వివరమంతా ప్రకటించబడింది. భారతీయులకు ఓటింగు హక్కు ఇండియన్ ఫ్రేంచైజ్ అనుశీర్షికను వ్రాసి యున్న కొన్ని పంక్తులు చదివాను. అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో భారతీయులు అడుగు పెట్టేందుకు వీలులేకుండా చేస్తూ వారికి ఓటింగు హక్కును నిరాకరిస్తూ వెంటనే ఒక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నదని అపత్రిక వల్ల తెలిసింది. అంటే భారతీయుల ఉనికికే ప్రమాదం ఏర్పడిందన్నమాట ఆ వివరమంతా సన్మాన సభకు వచ్చిన వారికి చదివి వినిపించి, అందువల్ల కలిగే పరిణామాల్ని కూడా