పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

భారతీయులు ఏం చేశారు? -1


విడమరిచి చెప్పాను యీ విషయమై యదార్థాలు నాకు సవివరంగా తెలియవు తెల్లవాళ్ల యీ ప్రయత్నాన్ని తీవ్రస్థాయిలో ఎదుర్కోవడం అవసరమని భారతీయులకు ఉద్బోధించాను వారంతా అందుకు అంగీకరించారు. అయితే మేము తిన్నగా ఉద్యమం నడపలేము, దయయుంచి ఒక్కనెల రోజులు మీరు యిక్కడ వుండండి అని వారంతా నన్ను కోరారు. యీ ఉద్యమం నడుపుటకు ఒకటి రెండు మాసాలు నేటాలులో వుండుటకు అంగీకరించాను ఆనాటి రాత్రి అసెంబ్లీకి పంపుటకు అర్జీ తయారు చేశాను బిల్లు ఆమోదాన్ని కొంత కాలం ఆపి వుంచమని తంతి అసెంబ్లీకి పంపించాము వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేశాము సేఠ్ అబ్దుల్లా హాజీ అదమ్‌ను ఆ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకున్నాము. పైన తెలిపిన టెలిగ్రాం వారి పేరటనే పంపించాము అందువల్ల బిల్లు పఠనం నేటాల్ అసెంబ్లీలో రెండు రోజులు ఆగిపోయింది ఆ అర్జీ దక్షిణాఫ్రికా అసెంబ్లీ అధికారులు నేటాలు అసెంబ్లీకి పంపించారు. అది భారతీయులు దాఖలు చేసిన మొదటి ఆర్జ దాని ప్రభావం బాగా పడింది. అయినా అసెంబ్లీలో బిల్లు ప్యాసు అయిపోయింది ఆ వివరాలు నాలుగో ప్రకరణంలో వ్రాశాను ఇది దక్షిణాఫ్రియందలి భారతీయులందరికీ. ఉద్యమం నడుపుటకు కలిగిన ప్రధమ అనుభవం దానితో వారి ఉత్సాహం పెరిగింది. ప్రతిరోజూ సభలే రోజురోజుకు జనం ఆ సభల్లో విపరీతంగా పొల్గొన సాగారు అవసరమైన దానికంటే అధికంగా ధనం వసూలు చేశారు. నకళ్లు తయారు చేయుటకు. సంతకాలు చేయించుటకు వాలంటీర్లు పెద్ద సంఖ్యలో లభించారు. వాళ్లు తమ సొంత డబ్బు ఖర్చు పెట్టి పని చేశారు. యీ ఉద్యమంలో గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన భారతీయులు కూడా పాల్గొన్నారు. వారందరికీ ఇంగ్లీషు వచ్చు. అంత అందమైన అక్షరాలతో వ్రాయగలిగినవారే వారంతో రాత్రింబగళ్లు కష్టపడిపనిచేశారు ఒక్క నెలరోజుల్లో 10 వేల మందితో సంతకాలు చేయించి పెద్ద అర్జీ లార్డ్ రిప్పన్‌కు పంపించారు. దానితో నా పని పూర్తి అయింది

ఇంటికి వెళ్లిపోతానని అందరికీ చేప్పాను ప్రారంభించిన ఉద్యమం భారతీయుల్లో క్రొత్త చైతన్యం తెచ్చింది. వాళ్లు వెళ్లవద్దని, ఉద్యమం