పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

భారతీయులు ఏం చేశారు? -1


తన్నులు తిని, యాత్రను ఆపి వేసుకొని రైలునుంచి దిగి, వైటింగ్ రూములో కూర్చొని వున్నాను నా సామాను ఎక్కడ వున్నదో నాకు తెలియదు. ఎవరినైనా అడుగుదామంటే ధైర్యం చాల లేదు. మళ్లీ అవమానం జరిగితే? మళ్లీ తన్నులు తినవలసి వస్తే? అట్టిస్థితిలో చలికి గజగజ వణుకుతూ కూర్చున్న వాడికి నిద్ర ఎలా పడుతుంది? మనస్సు ఆలోచనల సుడిగుండంలో చిక్కుకున్నది యోచిస్తూనే చాలా రాత్రి గడిచింది. నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇక్కడ నుంచి పారిపోవడం పిరికితనం చేబట్టిన పనిని నేను పూర్తి చేసితీరాలి వ్యక్తిగతమైన అవమానాలు సహించి, తన్నులు తినవలసి వచ్చినా తిని నేను ప్రిటోరియా చేరి తీరాలి యిదే నా నిర్ణయం ప్రిటోరియా నా కేంద్రస్థలి అక్కడే దాదా అబ్దుల్లా వ్యాజ్యం నడుస్తున్నది. నా పనులు చేసుకుంటూ భారతీయులు పడుతున్న కష్టాల్ని తొలగించుటకు చేతనైనంత సహాయం చేయాలి యిట్టి నిర్ణయానికి వచ్చిన తరువాత నాకు కొద్ది శాంతి లభించింది. నాకు క్రొత్త శక్తి కూడా కలిగినట్లనిపించింది. అయినా నాకు నిద్ర పట్టలేదు

తెల్లవారగానే నేను దాదా అబ్దుల్లా కొట్టుకి, రైల్వే జనరల్ మేనేజరుకు టెలిగ్రాములు పంపాను యిద్దరి నుంచి సమాధానం వచ్చింది. దాదా అబ్దుల్లా, అప్పుడు నేటాలులోవున్న వారి భాగస్వామి సేఠ్ అబ్దుల్లా హాజీ ఆదమ్‌ఝబేరీ యిద్దరూ భాగా స్పందించారు. వేరువేరు చోట్ల, మార్గంలో గల తమ భారతీయ ఏజంట్లకు నాకు ఏర్పాట్లు చేయమని టెలిగ్రాములు పంపించారు. వారు జనరల్ మేనేజర్ని కూడా కలిశారు. స్థానిక ఏజంటుకు యిచ్చిన వారి తంతి నందుకొని మెరిత్స్‌బర్గ్‌లో నివసిస్తున్న భారతీయ వ్యాపారస్తులు వచ్చి నన్ను కలిశారు వారు నాకు ధైర్యం చెప్పారు యిలాంటి కటు అనుభవాలు తమకు కూడా ఎన్నో కలిగాయనీ, అయితే మేము వీటికి అలవాటు పడిపోయాము కనుక మాకు ఏమీ బాధ అనిపించదు అని చెప్పారు. వ్యాపారానికి సున్నితమనస్సుకు పొంతన కుదరదని, అందువల్ల డబ్బును, డబ్బుతో పాటు యిట్టి అవమానాలను రెండిటినీ గల్లాపెట్టెలో పెట్టడం నేర్చుకున్నామని కూడా చెప్పారు. ఆ స్టేషనులోకి సింహద్వారం