పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

చరిత్ర


కలిసి ఆ రాజ్యాంగాన్ని అంగీకరించారు. బ్రిటిష్ పార్లమెంటు వారు ఆందలి ప్రతి అక్షరాన్ని అంగీకరించక తప్పలేదు. బ్రిటిష్ పార్లమెంటు మెంబరొకడు అందలి వ్యాకరణ సంబంధమైన ఒక తప్పును పేర్కొని ఆ తప్పును సరిచేయవలసిందని, రాజ్యాంగంలో వ్యాకరణ దోషం వుండకూడదని చెప్పగా, క. శే. సర్‌హెసరీ కాంప్‌బెల్ బైనర్‌మెన్ ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ "ఒకరాజ్యపరిపాలన శుద్ధవ్యాకరణ సూత్రాల వల్ల నడవదు. బ్రిటీష్ మంత్రిమండలి మరియు దక్షిణాఫ్రికా ప్రభుత్వమండలి సభ్యుల మధ్య ఎన్నో చర్చలు జరిగిన పిమ్మట వారంతా కలిసి యీ రాజ్యాంగాన్ని నిర్ధారణ చేసి అంగీకరించారు. అందువల్ల వ్యాకరణదోష్యాన్ని సైతం సరిదిద్దు అధికారం బ్రిటిష్ పార్లమెంటుకు లేదు" అని గట్టిగా చెప్పాడు. దానిలో దక్షిణ ఆఫ్రికా" రాజ్యాంగాన్ని యదాతధంగా బ్రిటిష్ పార్లమంటు, లార్డ్స్ సభ రెండూ అంగీకరించాయి. ఇక్కడ గమనించవలసిన మరో మూడో విషయంకూడా ఒకటి వున్నది యూనియన్ రాజ్యాంగమందలి కొన్ని నిబంధనలు తలస్థులకు అనవసరపుని అనిపించాయి. వాటి వల్ల ఖర్చుకూడా పెరిగింది. రాజ్యాంగ నిపుణులు యీ విషయాన్ని గమనించారుకూడా సర్వుల అంగీకారంతో, ఐక్యభావంతో, ఆచరణలో పెట్టుటకు అనువుగా రాజ్యాంగాన్ని రూపొందించడమే వారందరి లక్ష్యం అందువల్లనే యూనియన్‌కు చెందిన నాలుగు రాజ్యాలకు నాలుగు రాజధాని నగరాలు ఏర్పడ్డాయి. ఏ రాజ్యమూ తన రాజధానీ నగరం యొక్క మహత్తును వదులుకొనుటకు సిద్ధపడకపోవడమే అందుకు కారణం నాలుగు అధినివేశరాజ్యాలకు నాలుగు అసెంబ్లీలు ఏర్పాటు చేశారు. నాలుగు రాజ్యాలకు గవర్నర్లు వుండాలి కదా! కనుక గవర్నరువంటి ప్రాంతీయ అధికారులపదవుల్ని కూడా అంగీకరించారు నాలుగు అసెంబ్లీలు, నాలుగు రాజధాని నగరాలు నలుగురు ప్రాంతీయ అధికారులు అనవసరం శుద్ధదండుగ అజాగళస్తనాలు అని చాలా మంది విమర్శించారు. అందుకు దక్షిణాఫ్రికా పరిపాలనకు నడుం బిగించిన రాజకీయ అనుభవజ్ఞులు భయపడలేదు ఆడంబరం పాలు ఎక్కువగా వున్నా, డబ్బు అధికంగా ఖర్చు అయినా, వారు నాలుగు రాజ్యాల సమైక్యతకు