పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

21


నేను వ్రాసిన విషయంపై నా అభిప్రాయం ఎలా వున్నప్పటికీ చదివిసవాడి మనస్సు మీద, విన్నవాడి మనస్సు మీద ఏ ప్రభావం పడుతుందో, ఆ విధంగానే వ్రాశానని, లేక నా అభిప్రాయం వెల్లడించానని భావించాలి పలుసార్లు మనం బంగారం వంటి పైసూత్రాన్ని పాటించం అందువల్లనే కలహాలు. కార్పణ్యాలు ఏర్పడుతూ వుంటాయి సత్యం పేరట ముప్పావు అసత్యాన్ని పాటిస్తూ వుంటాము

ఈ విధంగా జనరల్ బోధాకు అనగా సత్యానికి సంపూర్తిగావిజయం లభించింది. అప్పుడు అతడు పరిపాలనా బాధ్యతను స్వీకరించాడు. తత్ఫలితంగా నాలుగు ఆధినివేశ రాజ్యాలు ఏకమయ్యాయి. దక్షిణాఫ్రికాకు స్వాతంత్ర్యం లభించింది. యూనియన్ జాక్ ఆదేశం పతాక ఆుంది. మ్యాపుల్లో ఆ దేశం రంగు ఎరుపుగా చిత్రించారు. ఏది ఏమైనా దక్షిణాఫ్రికా పూర్తిగా స్వతంత్ర దేశమని అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం అంగీకరించనిదే బ్రిటిష్ సామ్రాజ్యం ఒక్క పైసకూడా దక్షినాఫ్రికా నుంచి తీసుకు వెళ్లడానికి వీల్లేదు.

అంతేగాక దక్షిణాఫ్రికా కోరుకుంటే బ్రిటిష్ వారి పతాకను నిరాకరించవచ్చునని, పేరుకూడా మార్చుకోవచ్చునని కూడా బ్రిటిష్ మంత్రులు ప్రకటించారు. అయినా దక్షిణాఫ్రికాయందలి తెల్లవారు అందుకు పూనుకోలేదు కారణాలు అనేకం వున్నాయి బోయర్ నేతలు చాలా తెలివిగల వారు నిపుణులు తమకు నష్టం కలుగకుండా వుంటే, బ్రిటిష్ సామ్రాజ్యంతో సంబంధం పెట్టుకోవడానికి వారికి ఏమీ యిబ్బంది వుండదు. మరో ముఖ్య కారణంకూడా వున్నది. నేటాలులో ఇంగ్లీషు వారి సంఖ్య ఎక్కువ అయితే బోయర్ల కంటే తక్కువ జోహన్స్‌బర్గ్‌లో ఇంగ్లీషువాళ్లే ఎక్కువ అట్టిస్థితిలో బోయర్లు దక్షిణాఫ్రికాలో తమ సొంత రాజ్యాన్ని స్థాపించదలుచుకుంటే అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం వున్నది. అందువల్లనే దక్షిణాఫ్రికా యిప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్యానికి డొమినియన్‌గా వున్నది

దక్షిణాఫ్రికా యూనియస్ రాజ్యాంగాన్ని ఎలా నిర్ధారించారో కూడా తెలుసుకోవడం అవసరం నాలుగు అధినివేశ రాజ్యాల అసెంబ్లీలమెంబర్లంతా