పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

23


ఎక్కువ ప్రాధాన్యం యిచ్చారు. ఆ విధంగా తమకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని దక్షిణాఫ్రికా రాజకీయ అనుభవజ్ఞులు ఏకగ్రీవంగా అంగీకరించడమే గాక బ్రిటిష్ పార్లమెంటు చేత కూడా అంగీకరింపచేసుకున్నారు

దక్షిణాఫ్రికా చరిత్రను అతిక్లుప్తంగా పాఠకులకు తెలియజేయుటకు యిక్కడ ప్రయత్నించాను యీ వివరం తెలుపకపోతే యికముందు జరుగనున్న సత్యాగ్రహ మహాసంగ్రామ రహస్యం తెలియచేయడం కష్టమవుతుంది అసలు విషయానికి వెళ్లక పూర్వం భారతీయులు దక్షిణాఫ్రికాకు ఎలా వచ్చారో, సత్యాగ్రహం ప్రారంభం కావడానికి పూర్వం వాళ్లు ఏఏ కష్టాలు పడ్డారో, మనం తెలుసుకోవడం అవసరం




3

దక్షిణాఫ్రికాకు భారతీయుల రాక

ఆంగ్లేయులు నేటాలు చేరి అక్కడ వారు. జూలూల దగ్గర కొన్ని సదుపాయాలు అధికారాలు పొందారు. నేటాలులో చెరకు, కాఫీ, తేయాకు బాగా పండించవచ్చునని అనుభవం మీద వాళ్లు గ్రహించారు. పెద్దస్థాయిలో వీటిని పండించాలంటే వేలాది మంది కార్మిక జనం అవసరం నూరు నూటయాభై ఇంగ్లీషు కుటుంబాల వాళ్లు యీ పంటలు పండించడం సాధ్యంకాని పని అందువల్ల వాళ్లు హబ్షీలను ప్రోత్సహించారు భయపెట్టారు కూడా అక్కడ బానిస చట్టం రద్దయింది అందువల్ల హబ్షీలపై వత్తిడి తెచ్చి వాళ్లను అంగీకరింపచేయలేక పోయారు హబ్షీలకు ఎక్కువగా కాయకష్టంచేసే ఆలవాటు లేదు ఆరు నెలలు శ్రమపడి, వచ్చిన ఆదాయంతో సంవత్సరమంతా గడుపుతూ వుంటారు. అటువంటి స్థితిలో మరో యజమానులతో ఏండ్ల తరబడి ఒప్పందం చేసుకొని కాయకష్టం చేయుటకు వాళ్లు ఎందుకు సిద్దపడతారు? దానితో వాళ్లపై గల ఆశవదులు కొని మరొకరెవరైనా దొరుకుతారేమోనని ఆంగ్లేయులు యోచించారు. వారి దృష్టి భారతీయుల మీద పడింది. వెంటనే వాళ్లు భారత ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు