పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/384

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
365
సత్యాగ్రహ చరిత్ర


సత్యాగ్రహికి విశ్వాసం వుంటుంది. అట్టిస్థితిలో శతృపక్షం చేసే మోసం విషయమై నిశ్చింతగా వుంటాడు. ఎన్నిసార్లు మోసపోయినా శత్రువును సత్యాగ్రహినమ్ముతాడు. అందువల్ల సత్యానికి గల బలం పెరుగుతుందని, విజయం తప్పక లభించి తీరుతుందని భావిస్తాడు. ఆ విధంగా భావించి నేను పలు చోట్ల సభలు జరిపి భారత దేశ ప్రజలకు విషయమంతా వివరించి చెప్పాను. ఒడంబడికను అంగీకరించడం మంచిదని జనానికి నచ్చ చెప్పుటకు ప్రయత్నించాను ప్రజలు కూడా సత్యాగ్రహ విశేషాల్ని అర్థం చేసుకో గలిగారు. యీ పర్యాయం జరిగిన ఒడంబడికకు మధ్యవర్తిగాను, సాక్షిగాను శ్రీ ఆండ్రూస్ వున్నారు. వైస్రాయి ప్రతినిధిగా వచ్చిన సర్ బెంజిమన్ రాబర్ట్‌సన్ కూడా వున్నారు. అందువల్ల యీ ఒడంబడికను సైతం నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. నిజానికి నేను ఒడంబడిక చేసుకోవద్దని వాదించి యుంటే అది భారత జాతి చేసిన తప్పిందంగా చరిత్రలో నిలిచిపోయి వుండేది. ఆరునెలల తరువాత జాతికి లభించిన విజయానికి అనేక విఘ్నాలు కలిగియుండేవి. సత్యాగ్రహి ఎన్నడూ తన వైపు మరొకరు వ్రేలెత్తిచూపించే స్థితిలో వుండడు. కనుకనే “క్షమావీరస్య భూషణం" ఓర్పువీరులకు భూషణం" అనుసూక్తి ప్రచారంలోకి వచ్చింది. అపనమ్మకం కూడా పిరికి తనానికి లక్షణమే. నిర్భయుడికి భయమెందుకు? సత్యాగ్రహంలో భయానికి తావులేదు. విరోధిగా వున్నవాడిని నాశనం చేయడం సత్యాగ్రహిలక్షణం కాదు. అతని హృదయాన్నుంచి శత్రు ప్రవృత్తిని తొలగించడమే అతని కర్తవ్యం. అట్టి స్థితిలో యిక అపనమ్మకం అనవసరం.

భారతజాతి ఒడంబడికకు అంగీకారం తెలిపింది. యిక యూనియస్ పార్లమెంటు సమావేశం కోసం అంతా ఎదురు చూస్తూ వున్నారు. కమీషన్ తన పని చేస్తూ వున్నది. కమీషన్ ఎదుటకు భారతజాతి పక్షాన వెళ్ళిన సాక్షులు బహుతక్కువ. దీనివల్ల భారత దేశ ప్రజల మీద సత్యాగ్రహ సమితికి ఎంత పట్టుపున్నదీ ప్రపంచానికి తెలిసి పోయింది, సర్ బెంజిమన్ రాబర్ట్‌సన్ చాలా మంది భారతీయుల్ని కమీషన్ ఎదుట సాక్ష్యం యిమ్మని ప్రోత్సహించాడు. కాని అసలు సత్యాగ్రహోద్యమాన్ని వ్యతిరేకించిన బహుకొద్దిమంది తప్ప,