పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

366

పోరాటం సమాప్తం


మరెవ్వరూ అతడి మాట వినలేదు. కమీషన్ ఎదుట సాక్ష్యం చెప్పలేదు అయితే యిట్టి బహిష్కరణ వల్ల కమీషన్‌పై వ్యతిరేక ప్రభావం పడలేదు పైగా దానిపని సులభమైపోయింది. కమీషన్ సమర్పించిన రిపోర్టు ప్రచురించబడింది. రిపోర్టులో కమీషన్ సభ్యులు భారతజాతి ప్రజల సహకారం లభించనందుకు అసంతృప్తి ఎక్కువగా ప్రకటించారు. రక్షక భటులు దుర్మార్గాలు చేశారనే ఆరోపణను తేలికగా కొట్టివేశారు. అయితే భారత జాతి కోరిన కోరికల్ని తక్షణం నెరవేర్చమని సిఫారసు చేశారు ఉదాహరణకు మూడు పౌండ్ల పన్ను చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి వివాహానికి పంబంధించిన భారతీయుల కోర్కెను వెంటనే అంగీకరించాలి యింకా యిటువంటి పెద్ద చిన్న కోరికల్ని ఉటంకించి వాటిని తక్షణం అంగీకరించి నెరవేర్చమని ప్రభుత్వానికి కమీషన్ సిఫారసు చేసింది జనరల్ స్మట్సు చెప్పిన ప్రకారం కమీషన్ రిపోర్టు భారత జాతికి అనుకూలంగా గొప్ప సహాయం చేసింది. శ్రీ అండ్రూస్ ఇంగ్లాండుకు బయలు దేరారు. సర్ బెంజిమన్ రాబర్ట్‌సన్ ఇండియాకు బయలుదేరారు. కమీషన్ సమర్పించిన రిపోర్టు ప్రకారం త్వరలోనే చట్టాలు తయారు చేయబడతాయని, మాకు నమ్మకం కలిగింది. ఆ చట్టం ఏమిటో, అది ఎలా తయారు చేయబడిందో తరువాతి ప్రకరణంలో తెలుసుకుందాం



50

పోరాటం సమాప్తం

కమీషన్ రిపోర్టు ప్రచురించబడిన కొద్ది రోజులకే, ఒడంబడికకు ప్రాతిపదికగా నున్న చట్టం యొక్క ముసాయిదాను యూనియన్ గెజెట్లో ప్రకటించారు యీ ముసాయిదాను ప్రకటించగానే నేమ కేప్‌టౌను వెళ్ల వలసి వచ్చింది యూనియన్ పార్లమెంటు సమావేశం అక్కడే జరుగుతున్నది. ఆ బిల్లులో తొమ్మిది నిబంధనలు ఉన్నాయి. ఆ బిల్లు అంతటిని నవజీవన్ పత్రికలో