పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/383

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
364
ఉత్తర ప్రత్యుత్తరాలు


అధికారులు భయపడే వాళ్లను భయపెడుతూ వుంటారని, నిర్భయంగా వుండేవాళ్ళ జోలికి పోరని అనేక పర్యాయాలు అనుభవం వల్ల తెలుసుకున్నాను.

ఈ విధంగా ప్రభుత్వంతో మా ప్రాధమిక ఒడంబడిక జరిగింది సత్యాగ్రహాన్ని ఆపుచేశాము అందువల్ల అనేక మంది ఆంగ్ల మిత్రులు ఆనందించారు. చివరి ఒడంబడికకు సంపూర్తిగా సహకరిస్తామని వాళ్లు మాటయిచ్చారు. అయితే జాతి ప్రజల్ని యీ ఒడంబడిక అంగీకరింప చేయడం కష్టమని తోచింది. జాతి ప్రజల్లో ఆవిర్భవించిన ఉత్సాహం చల్ల బడటం ఎవ్వరికీ యిష్టం లేదు. అసలు జనరల్‌ స్మట్సు మీద ఎవ్వరికీ నమ్మకం లేదు. 1908లో జరిగిన ఒడంబడికను జ్ఞాపకం చేసి కొందరు “జనరల్ స్మట్సు ఒక్క పర్యాయం భారత జాతిని మోసం చేశాడు. అనేకసార్లు మీ మీద సత్యాగ్రహంలో కొత్తకొత్త విషయాలు చేరుస్తున్నాడని ఆరోపణలు చేశాడు. జాతి ప్రజలపై అత్యాచారాలు చేశాడు. యింత జరిగినా జనరల్ స్మట్సును మీరు అర్థం చేసుకోలేదంటే ఎంతో విచారం కలుగుతున్నది. యీ మనిషి మళ్లీ మోసం చేస్తాడు. అప్పుడు మీరు మళ్లీ సత్యాగ్రహం అని అంటారు. అప్పుడు మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? జనం మాటి మాటికీ జైళ్లకు వెళ్లడం కష్టనష్టాలు పడటం సంభవమా? జనరల్ స్మట్సు వంటి మనిషితో ఒకే ఒక ఒడంబడిక చేసుకోవాలి.

మన జాతి ప్రజలు కోరిన కోరికల్ని నెరవేరుస్తున్నట్లు ఆయనచేత వ్రాయించి పత్రం తీసుకోవాలి. అంతేగాని అతగాడి నోటి మాటలను నమ్మవద్దు. మాట యిచ్చి ఆ ప్రకారం నడుచుకోని మనిషిని ఎలా నమ్మడం?" అని మనస్ఫూర్తిగా చెప్పారు.

ఇలాంటి వాదనలు తప్పవని నేను ముందే ఊహించాను. అందువల్ల నాకు ఏమీ ఆశ్చర్యం కలుగలేదు. ఎవడు ఎన్నిసార్లు మోసం చేసినా సత్యాగ్రహి అతణ్ణి నమ్మవలసిందే. అతడు మోసం చేశాడనే విషయం స్పష్టంగా ధృవీకరించబడాలి కదా సత్యాగ్రహి దుఖాన్ని సుఖమని భావించి రంగంలోకి ప్రవేశిస్తాడు. అపనమ్మకానికి కారణమేమీ కనబడనప్పుడు, తరువాత దుఃఖం కలుగుతుందన్న భయంతో శతృవును శంకించడు. తనశక్తి మీద