పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

342

జనమంతా జైళ్లలో


వుండాలనే ఉద్దేశ్యంతో అపరాధం చేశానని అంగీకరించారు. కాని ఇండియా వెళ్లడం శ్రీపోలక్ లక్ష్యం. అందువల్ల జైలుకు వెళ్లడం వారికి యిష్టం లేదు. అపరాధం చేశారా అని అడిగితే చేశామని కాని చేయలేదనికాని చెప్పకుండ మౌనం వహిద్దామని నిర్ణయానికి వచ్చాము. -

కోర్టులో కేసునడిసింది. వాళ్లిద్దరికీ వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పాను. కేసును లాగాధీయడం మాకు యిష్టంలేక ఒక్కొక్క రోజున మాకేసులు పూర్తి అయ్యేలా మేము కోర్టుకు సహకరించాము. మా ముగ్గురికీ మూడు మూడు మాసాల జైలును శిక్ష విధించబడింది. కనీసం మూడు మాసాల పాటు బాక్స్‌రస్ట్ జైల్లో కలిపి వుండవచ్చునని అనుకున్నాం. కాని అలా వుండనీయడం వల్ల ప్రభుత్యానికి లాభం కనబడలేదు.

కొద్ది రోజులు అక్కడ జైల్లో మేము సుఖంగా వున్నాము. అక్కడికి రోజూ కొత్త ఖైదీలు వస్తూవుండేవారు. బయట జరుగుతున్న వివరాలన్నీ మాకు చెబుతూవుండేవారు. ఇట్టి సత్యాగ్రహుల్లో హరబత్‌సింగ్ అను ఒక వృద్ధుడు వున్నాడు. అతడికి 75 సంవత్సరాల వయస్సు అతడు గనుల్లో పనిచేయడంలేదు. గిర్‌మిటియా ప్రధనుంచి ముక్తి ఎప్పుడో పొందాడు. నిజానికి అతడు అపరాథికాదు. కాని నన్ను అరెస్టు చేశాక ప్రజల్లో ఉద్రిక్తత పెరిగింది చాలామంది జనం నేటాలు దాటి ట్రాన్స్‌వాల్ సరిహద్దుల్లోకి ప్రవేశించి అరెస్టు కాసాగారు. హరబత్‌పింగ్ అటువంటి ఉత్సాహవంతుడైన సత్యాగ్రహి

జైల్లో హరబత్‌సింగ్‌ను చూచి “మీరు జైలుకు ఎందుకు వచ్చారు? మీవంటి వృద్ధుల్ని జైలుకు రమ్మని నేను కోరలేదుగదా!" అని అన్నాను.

"మాకోసం మీరు, సతీమణి, మీ బిడ్డలు కూడా జైలుకు వెళ్లితే, బైట వుండటం నాబోటివాడికి సాధ్యమా?" అని హరబత్‌సెంగ్ జజాబిచ్చాడు.

“మీరు కష్టాలు పడలేరు. జైలు వదిలి వెళ్లండి. మీ విడుదలకు నేను ప్రయత్నం చేస్తాను" అని అన్నాను.

“నేను వెళ్లను. ఏదో ఒక రోజున నేను చనిపోవలసిందేగదా? ఇలాంటి చోట చనిపోవడం గొప్ప అదృష్టంగా భావిస్తాను" అని అన్నాడు హరబత్‌షింగ్. ఇంతటి, స్థిరమైన అభిప్రాయాన్ని నేను మార్చగలనా? నేను, ప్రయత్నించినా