పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

343


అస్థిరత్వం మారదు. అక్షరం జ్ఞానంలేని అతడిముందు నాసిరస్సు వినమ్రతతో వంగి పోయింది. ఆయన కోరిక నెరవేరింది. 1914 జనవరి 5వ తేదీన ఆయన జైల్లోనే కన్ను మూశాడు. అతడి శవాన్ని బాక్స్‌రస్టు నుంచి డర్భను తెచ్చారు. వేలాది మంది భారతీయుల సమక్షంలో సగౌరవంగా హరబత్‌సింగ్ శవానికి దహన సంస్కారాలు జరిగాయి. మా సత్యాగ్రహ సంగ్రామంలో యిలాంటి హరబత్‌సింగులు అనేక మంది పాల్గొన్నారు. అయితే జైల్లో పరమ పదించే గౌరవం మాత్రం ఒక్క హరబత్ సింగ్‌కే లభించింది. అందువల్లనే దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర యందు అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.

ఈ విధంగా జనం ఉత్సాహంతో జైళ్లుకు రావడం ప్రభుత్వానికి నచ్చలేదు. జైల్లో నుంచి విడుదలై వచ్చిన సత్యాగ్రహులు నాసందేశాన్ని ప్రజలకు అందజేయడం కూడా ప్రభుత్వానికి నచ్చలేదు. అందువల్ల ప్రభుత్వం నన్ను, పోలక్‌ను, కేలన్‌బెక్‌ను కలిపి వుండనీయకూడదనీ, వేరువేరు జైళ్లలో వుంచాలనీ, ముఖ్యంగా నన్ను మాత్రం ఏకాకిగా ఎవ్వరికీ తెలియని చోట బంధించి వుంచాలనీ నిర్ణయానికి వచ్చింది. అందువల్ల నన్ను రెంజియా రాజధాని బ్యూంపోస్టీన్ జైలుకు పంపిందారు... అక్కడ 50 మందికంటే ఎక్కువమంది భారతీయులు లేరు. వున్నావాళ్లు కూడా హోటళ్లలో వైటర్లుగా పనిచేస్తున్నారు. ఇలాంటి చోట జైల్లో భారతీయ ఖైదీలు పుండరు. ఇక ఆ జైల్లో వున్న భారతీయ ఖైదీని నేను ఒక్కడినే. మిగతా ఖైదీలు తెల్లవాళ్లు లేక హబ్షీలు. ఏకాకిగా వున్నా నేను బాధపడలేదు. నాకు మంచి జరగిందని భావించాను. 1893 తరువాత అధ్యయనానికి నాకు అసలు అవకాశం చిక్కలేదు. ఇప్పుడు యీ రూపంలో చిక్కిందని భావించాను

బ్లూంఫోస్టీన్ జైల్లో నాకు విధించిన శిక్ష కఠోరమైనది. అక్కడ సౌకర్యాలు అపరిమితం, వాటి వివరాలన్నీ, యిక్కడ ప్రయతలచలేదు. కాని ఒక్క విషయం మాత్రం వ్రాయక తప్పదు. అక్కడి డాక్టరు నాకు స్నేహితుడయ్యాడు. కాని జైలరు మాత్రం కేవలం అధికారిగానే వుండిపోయాడు. డాక్టరు కైదీల అధికారాలను కాపాడుతూ వుండేవాడు. అప్పుడు నేను పలాలు మాత్రమే భుజించడం ప్రారంభించాను. పాలు, నెయ్యి, ధాన్యం, అన్నీ వదిలివేశాను.