పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

341

ఇటు శ్రీ పోలక్‌ను బెల్‌ఫోర్ట్‌లో అరెస్టు చేయలేదు. ఆయన చేసిన సహాయానికి అధికారులు కృతజ్ఞత తెలియజేశారు. శ్రీ పోలక్‌ను అరెస్టు చేయాలని ప్రభుత్వానికి తలంపే లేదని శ్రీ చిమనీ చెప్పాడు. అయితే యిది శ్రీచిమనీ వ్యక్తిగత అభిప్రాయం అయివుండవచ్చు లేక ఉహించి యిది ప్రభుత్వాభిప్రాయమని అనుకొని ఆయన చెప్పి యుండవచ్చు. ప్రభుత్వాభిప్రాయం మారవచ్చుకదా! శ్రీ పోలక్‌ను, శ్రీ కెలన్‌బెక్‌లను ఇండియాకు వెళ్లనీయకూడదని, వాళ్లు భారతీయుల కోసం అత్సుత్సాహంగా పనిచేస్తున్నారని, వారికి అడ్డుకట్టవేసేందుకు అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీ పోలక్‌ను చార్లస్‌టౌనులో అరెస్టు చేశారు. కేలన్‌బెక్‌ను కూడా నిర్బంధంలోకి తీసుకున్నారు. ఇద్దరివీ వాక్సరస్ట్ జైల్లో వుంచారు.

1931 నబంబరు 11వ తేదీన డండీలో నా మీద విచారణ జరిపి 9 మాసాల కఠిన కారాగార శిక్ష నాకు విధించారు. నామీద మరో కేసుకూడా నడుస్తున్నది. నిషిద్ధవ్యక్తుల్ని ట్రాన్స్‌వాల్‌లోకి ప్రవేశించమని నేను ప్రోత్సాహించానని ఆకేసు సారం. అందుకై నన్ను డండీనుంచి నవంబరు 13వ తేదీన బాక్‌రస్ట్ తీసుకు వెళ్లారు. అక్కడ నేను శ్రీపోలక్, శ్రీకెలన్‌బెక్‌లను చూచాను. మేము ముగ్గురం బాక్‌రస్టు జైల్లో కలిశాము. పరమానంద భరితులం అయ్యాము.

నవంబరు 14వ తేదీన బాక్సరస్ట్ కోర్టులో నా మీద కేసు నడిపించింది. ఈ కోర్టులో ఒక విచిత్రం జరిగింది. కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం యివ్వడానికి సాక్షుల్ని నేను తీసుకురావాలనడమే ఆచిత్రం. అట్టి సాక్షుల్ని పోలీసులు తీసుకురాగలరు. కాని అందుకైవారు శ్రమపడాలి. అందువల్ల యీ వ్యవహారంలో సాయం చేయమని పోలీసులు నన్ను కోరారు. దక్షిణాఫ్రికా యందలి కోర్టులు, అపరాధి నేనుదోషం చేశానని చెప్పినంత మాత్రాన శిక్షలు విధించవు.

నా విషయంలో యిట్టి ఏర్పాటు జరిగింది. కాని శ్రీపోలక్, శ్రీ కేలన్‌బెక్‌లకు వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెబుతారు? వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం లేకపోతే వారికి శిక్ష పడదు. శ్రీకేలన్‌బెక్ యాత్రా దళ సబ్యుల వెంట