పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

336

ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశం - 2


పౌండ్ల జమానతు చెల్లించిన మీదట విడుదల చేశాడు. శ్రీ కెలన్‌బెక్ బయట కారుతో సిద్ధంగా, వున్నారు. దానిమీద ఎక్కించుకొని యాత్రా బృందం దగ్గరికి చేర్చారు. 'దిట్రాన్స్‌వాల్ రీడర్' అను పత్రికా ప్రత్యేక ప్రతినిధి మాతోబాటు వస్తానని అన్నాడు. ఆయనను కారులో ఎక్కించుకున్నాము. నా విచారణ, కారు యాత్ర, యాత్రా బృందం వివరం అంతా ఎంతో చక్కగా వ్రాసి తమ పత్రికలో ప్రచురించాడు. దాని ప్రభావం మంచిగా జనం మీద పడింది. ప్రజలు నాకు స్వాగతం చెప్పారు. ప్రజల ఉత్సాహానికి అంతే లేదు. తరువాత శ్రీ కెలన్‌బెక్ బాక్స్‌రస్టు వెళ్లి పోయారు. చార్ల్స్‌టౌనులో ఆగియున్న, క్రొత్తగా రానున్న భారతీయుల ఏర్పాట్లు ఆయన చూడవలసి యున్నందున వారు వెంటనే వెళ్లిపోయారు.

మా యాత్రాదళం ముందుకు సాగింది. నన్ను స్వతంత్రంగా వుంచడం ప్రభుత్వానికి యిష్టం లేదు. అందువల్ల మరుసటి రోజున, నన్ను స్టాండర్టన్‌లో అరెస్టు చేశారు. అది పెద్ద ఊరు. అక్కడ నన్ను విచిత్రంగా అరెస్టు చేశారు. అక్కడ వ్యాపారులు డబుల్ రొట్టెలు, మురబ్బాడబ్బాలు అందజేశారు. వాటి పంపిణీకి సమయం పట్టింది. మేజిస్ట్రేటు నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆహారం పంపిణీ చేసేదాక ఆగాడు. తరువాత నన్ను ప్రక్కకి పిలిచాడు, నేను వారిని ఎరుగుదును. ఆయన నవ్వుతూ “మీరు నాఖైదీ" అని అన్నాడు.

"అయితే నా స్థాయి పెరిగిందన్నమాట. పోలీసులకు బదులు మేజిస్ట్రేటు స్వయంగా వచ్చారన్న మాట. ఇప్పుడే కేసు నడుపుతారుకదా! అని అన్నాను.

“వాతోబాటురండి, కోర్టు తెరిచే వున్నది" అని అన్నాడు. యాత్రా దళాన్ని ముందుకు సాగమని చెప్పి నేను మేజిస్ట్రేటు వెంట వెళ్లాను. కోర్టు దగ్గరికి చేరినప్పుడు అక్కడ అరెస్టు తీసుకొని వచ్చిన నా అనుచరుల్ని కొందరిన్ని చూచాను అయిదు మంది వున్నారు. పి.కె. నాయుడు, బీహారు లాల్ మహారాజ్, రామనారాయణసింహ, రఘునాదను, రహీంఖాన్.

నమ్న కోర్టులో నిలబెట్టారు. బాక్స్‌రస్టు కోర్టులో చెప్పినట్లే చెప్పి జమానతుమీద విడుదల చేయమని కోరాను. యిక్కడ కూడా ప్రభుత్వ వకీలునా అర్జీని వ్యతిరేకించాడు. అయినా మేజిస్ట్రేటు 1913 నవంబరు 21