పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

335


చెప్పాను. భారతీయ వ్యాపారి నా ప్రార్థనను అంగీకరించాడు.

చీకటి పడిన కొద్దీ గొడవ సద్దుమణిగింది. నేను కూడా పడుకుందామని అనుకుంటూ వుండగా యింతో బూట్ల చప్పుడు వినబడింది. ఒక తెల్లవాడు చేత్తో లాంతరు పట్టుకొని వస్తూ పూడటం చూచాను నేను జాగ్రత్తపడిపోయాను అంతా అర్థమైంది. నేను సిద్ధంగానే వున్నాను. పోలీసు అధికారి దగ్గరికి వచ్చి "మీకు వారంటు తెచ్చాను. మిమ్మల్ని అరెస్టు చేయాలి" అని అన్నాడు.

"ఎప్పుడు?" అని అడిగాను

“ఇప్పుడే" అని అన్నాడు. అధికారి,

"నన్ను ఎక్కడకి తీసుకు వెళతారు?”

“ఇప్పుడు దగ్గరలోనే వున్న రైలు స్టేషనకు తీసుకువెళతాను. బండిరాగానే దాని బాక్సరస్ట్ తీసుకు వెళతాను.

“అయితే ఎవ్వరిని మేల్కొలపకుండానే మీవెంట వస్తాను. అయితే నా అనుచరుడికి కొన్ని సూచనలు యిస్తాను."

"అలాగే యివ్వండి"

అక్కడే నిద్రపోతున్న శ్రీ పి.కె. నాయుడును మేల్కొలిపాను. నా అరెస్టును గురించి వారికి చెప్పాను. తెల్లవారకముందే ఎవ్వరినీ లేపవద్దని, ఆ తరువాత అందరినీ యాత్రకు బయలుదేరతీయమని, చెప్పాను. నాయుడు భయపడలేదు. తనను కూడా అరెస్టు చేస్తే ఏం చేయాలో కూడా చెప్పాను. శ్రీ కేలెన్‌బెక్ బాక్స్‌రస్ట్‌లోనే వున్నారు. నేను పోలీసు అధికారి వెంట వెళ్లాను. తెల్లవారింది. మేమిద్దరం బాక్స్‌రస్టు వెళ్లే రైలు ఎక్కాము. అక్కడి కోర్టులో నా మీద విచారణ జరిగింది. పబ్లిక్ ప్యాసిక్యూటరు నా దగ్గర తగిన ఆధారాలేమీలేవు. కనుక 1913 నవంబరు 14 వరకు కేసును వాయిదా వేయమని స్వయంగా కోరాడు. నేను వాయిదాపడింది. జమానతు మీద విడుదల చేయమని ఆర్జీ దాఖలు చేశాను. అందునా వెంట 122 మంది స్త్రీలు, 50 మంది బాలబు, 2000 మంది పురుషులు వున్నారు. ఈ లోపున వాళ్లందరినీ నిశ్చిత స్థలానికి చేర్చి విచారణ తేదీకి తిరిగి వస్తానని మనవి చేశాను. ప్రభుత్వ వకీలు నా అర్జీని వ్యతిరేకించాడు. కాని మేజిస్ట్రేటు ఏమీ చేయలేక