పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

337


వరకు కేసును వాయిదా వేసి 50 పౌండ్ల జమానతు మీద విడుదల చేశాడు. భారతీయ వ్యాపారులు నాకోసం ఇక్కాబండి సిద్ధంగా వుంచారు. దానిమీద ఎక్కించి యాత్రా దళం దగ్గరికి చేర్చారు. అప్పటికి మూడు మైళ్ల దూరం యాత్రా దళం చేరింది. ఇక టాల్‌స్టాయి క్షేత్రం వరకు అంతా చేరతామని ఆనుకున్నాం. కాని మా యీ అభిప్రాయం తప్పని తేలింది. యాత్రా దళ సభ్యులు నా అరెస్టుకు అలవాటు పడ్డారు. ఇది పెద్ద పరిణామమే. నా అయిదు మంది అనుచరులు జైల్లోనే వున్నారు.




45

జనంమంతా జైళ్లలో

మేము యాత్రకావిస్తూ జోహన్స్‌బర్గు దగ్గరికి చేరుకున్నాము. సంపూర్ణ యాత్రను ఎనిమిది రోజులపాటు, ఎనిమిది మజిలీలుగా నిర్ణయించిన విషయం పాఠకులకు తెలుసు. ఇప్పటివరకు నిర్ణయించిన ప్రకారం మజిలీలు పూర్తిచేస్తూ వున్నాము. ఇక నాలుగు మజిలీలు దాటాలి. మా ఉత్సాహం పెరుగుతున్నకొద్దీ ప్రభుత్వంలో అలజడి ప్రారంభమైంది. మజిలీలు దాటేంతవరకు మౌనం వహించి ఆ తరువాత మమ్మల్ని అరెస్టు చేస్తే ప్రభుత్వం పరువు పోతుంది. కనుక మజిలీ చేరకముందే మమ్మల్ని ప్రభుత్వం ఆరెస్టు చేయాలి.

నన్ను అరెస్టు చేసినా మా బృందం వెనుకంజవేయలేదు. భయపడలేదు. ఏ రకమైన ఉపద్రవమూ చేయలేదు. ఏ మాత్రం ఉపద్రవం చేసినా తుపాకి తూటాలతో మా బృందంమెంబర్ల నందరినీ ప్రభుత్వం కాల్చిచంపవేసేదే. జనరల్ స్మట్స్‌కు యీ యాత్రలో మేము చూపిన ధైర్యం, ప్రశాంతత దు:ఖం కలిగించాయి. .. .

గోఖలే తంతిద్వారా శ్రీ పోలక్‌ను ఇండియాకు పంపమని, వారి సహాయంతో దక్షిణాఫ్రికా భారతీయుల పరిస్థితులను' గురించి, భారత ప్రభుత్వానికి, బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలియజేశారు.