పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

329


అప్పుడు కార్మికుల సమ్మె తీవ్రంగా సాగుతున్నది. ఆ సమ్మెలో స్త్రీలు, పురుషులు యిరువురు పాల్గొంటున్నారు. స్త్రీలలో, యిద్దరు తల్లుల వెంటవారి బిడ్డలు కూడా వున్నారు. ఒక బిడ్డ ఆ గుంపులో - శీతలంకమ్మి చనిపోయింది. రెండోబిడ్డ, తల్లి కాలువ దాటుతూ వుండగా చెయ్యజారి నీటిలో పడిపోయింది. చనిపోయింది. అయినా తల్లులు బయపడలేదు. సత్యాగ్రహ యాత్రలో యిద్దరూ పాల్గొని ముందుకు సాగారు. “చనిపోయిన బిడ్డల కోసం ఎందుకు శోకించడం? వాళ్లు తిరిగి రారు కదా! జీవించి యున్నా బిడ్డల కోసం త్యాగం చేద్దాం" అని ఆ యిరువురు తల్లులు అన్నారు. పేద స్త్రీలు సైతం యింతటి త్యాగం, యింతటి దీక్ష, యింతటి నిష్ఠ చూపడం సామాన్యమైన విషయమా? యిటువంటి ఎన్నో జ్ఞానోదయం కలిగించే ఘట్టాలు చూచాను.

చార్ల్స్‌టౌన్‌లో స్త్రీలు పురుషులు దృఢమైన దీక్షతో ముందుకు అడుగు వేశారు. అయితే మేము అక్కడికి వేరే పనిమీద వచ్చాం. కొని అక్కడ ఎటు చూచినా "ఇక్కడ శాంతి లేదు" అని వ్రాసి యున్న అట్టలు కనబడ్డాయి. అలాంటి అశాంతిమయమైన చోటునందే, మీరాబాయి వంటి భక్తురాలు విషపాత్రను అధరాలతో తాకింది. సుకరాత్ విషపాత్రను పుచ్చుకొని చీకటికొట్టో కూర్చుని అనుచరులకు శాంతి కావాలనుకంటే నీవు నీలోనే వెతికి చూచుకో" అంటూ జ్ఞనోపదేశం చేశాడు.

ఇలాంటి అశాంతిమయమైన చార్ల్స్‌టౌనులో సత్యాగ్రహదళ సభ్యులు మకాం పెట్టి రేపే మవుతుందో తెలియని స్థితిలో పడి వున్నారు. నేను ట్రాన్స్‌వాల్ ప్రభుత్వానికి జాబు వ్రాశాను. అందు “మేము ట్రాన్స్‌వాల్‌లో నివాసం కోసం రావడం లేదు. మీరు చేసిన వాగ్దాన భంగానికి వ్యతిరేకంగా మా అభిప్రాయం తెలుపుటకు మాత్రమే వస్తున్నాము. ఆ స్వాభిమానానికి మీరు కొట్టిన గట్టి దెబ్బను ప్రశాంతంగా ప్రకటించడమే మా యీ యాత్రాదళ ఉద్దేశ్యం. మీరు చార్ల్స్‌టౌన్‌లోనే మమ్మల్ని అరెస్టు చేస్తే సంతోషిస్తాం, అట్టి స్థితిలో మాలో ఎవరైనా రహస్యంగా ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశిస్తే అందుకు మేము బాధ్యత వహించం, మా యీ పోరాటంలో రహస్యం ఏమి లేదు, మాకేమి వ్యక్తిగతస్వార్థం లేదు, మాలో రహస్యంగా ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశించడం మాకు