పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/347

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు తెలియని సమస్య ఎదురైనది
328
ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశం - 1


ఇవన్నీ తీయని జ్ఞాపకాలు, కాని చేదు అనుభవాలు కూడా కలిగాయి. ఒక్క నిమిషం పాటు సమయం చిక్కితే తగాదాల వ్యవహారం ముమ్మరంగా సాగుతూ ఉండేది. అది చెడ్డ అలవాటు. అక్కడ వ్యభిచారం కూడా మొదలైంది. స్త్రీపురుషుల్ని విడిగా వుంచడానికి చోటు లేక కలిసి వుంచితే దానికి దుష్పలితంగా వ్యభిచారం సాగింది. వ్యభిచారికి సిగ్గు వుండదు. అలాంటి ఘట్టాలు జరుగుతున్నాయని తెలియగానే నేను వెళ్లేవాడిని. వ్యభిచారులు సిగ్గుతో తలవంచుకునేవారు. విడివిడిగా వుంచినా నాకు తెలియని ఘట్టాలు ఎన్ని జరిగాయో ఎవరికెరుక? ఇక యీ చర్చను అపుతాను. ఇదంతా ఎందుకు వ్రాశానంటే అంతా సవ్యంగా జరగలేదని పాఠకులు తెలుసుకోవాలని నా కోరిక. అయితే ఎవ్వరూ నా మీద విరుచుకుపడలేదు. అడవి జాతి రకం వాళ్లే అయినా, నీతికి అనీతికి తేడా తెలియని వాళ్లే అయినా, వాతావరణం మంచిగా వుంటే సరియైన మార్గం మీద అంతా నడుస్తారు. ఈ విషయం పలు ఘట్టాల వల్ల తెలుసుకున్నాను. ఈ సత్యాన్ని తెలుసుకోవడం అవసరం. ఎంతో ప్రయోజనకరం కూడా.
43

ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశం - 1

19-- నవంబరుమాసం చివరికి చేరుకున్నాం. ముందుకు సాగే పూర్వం రెండు ఘట్టాలు వివరిస్తాను. న్యూకేసిల్‌లో తమిళ సోదరీమణులు జైలుకు వెళ్లారని తెలుసుకొని డర్బనుకు , చెందిన. భాయీ. పాతిమా మెహతాబ్ ఆగలేక తన తల్లి హనీపాల బాయిని, ఏడు సంవత్సరాల వయస్సుగల బిడ్డడిని వెంటబెట్టుకొని జైలుకు వెళ్లాలని బాక్స్‌రస్టుకు బయలుదేరింది. తల్లికూతుళ్లను అరెస్టు చేశారు. కాని బిడ్డని అరెస్టు చేయడాని ప్రభుత్వం అంగీకరించలేదు ఆయీఫాతిమా, వ్రేళ్ల ముద్రలు తీసుకోవాలని పోలీసులు చాలా ప్రయత్నం చేశారు. కాని ఆమె నిర్భయంగా నిలబడి వ్రేలి ముద్రలు వేయనని భీష్మించింది