పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330

ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశం - 1


యిష్టంలేదు. వేలాది మంది అపరిచితులతో నిండి సాగుతున్నా మాయీ సత్యాగ్రహ సమరంలో ఎవరైనా రహస్యంగా వస్తే మేమేమీ చేయలేము. మీరు మూడు పౌండ్ల తలపన్ను రద్దు చేస్తే మా యీ యాత్ర తక్షనం అగిపోతుంది. గిర్‌మిట్ కార్మికులు తిరిగి పనికి వెళ్లిపోతారు, "అని స్పష్టంగా వ్రాశాను.

మా స్థితి అనిశ్చితంగా వున్నది. ప్రభుత్వం ఎప్పుడు మమ్మల్ని అరెస్టు చేస్తుందో తెలియదు. అట్టిస్థితిలో ప్రభుత్వం వారి జవాబుకోసం మేము వేచి వుండటం సాధ్యం కాని పని. అందువల్ల ప్రభుత్వం అరెస్టు చేయకపోతే మనం చార్ల్స్‌టౌన్ వదలి ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశిద్దామని నిర్ణయానికి వచ్చాం. త్రోవలో ప్రభుత్వం అరెస్టు చేయకపోతే రోజుకు 26 లేక 24 మైళ్లు నడుస్తూ ఎనిమిది రోజుల పాటు యాత్ర సాగించాలని కూడా నిర్ణయానికి వచ్చాం ఎనిమిది రోజుల్లో టాల్‌స్టాయి క్షేత్రం చేరుకోవడం మా లక్ష్యం. సంగ్రామం పూర్తి అయ్యేదాకా సత్యాగ్రహులంతా అక్కడే వుండాలనీ, కాయకష్టం చేసి భోజనం ఏర్పాటుచేసుకోవాలని కూడా నిర్ణయానికి వచ్చాం శ్రీ కెలిన్‌బెక్ ఏర్పాటంతా చేసి వుంచారు. అక్కడ కార్మికుల చేత మట్టి యిళ్లు నిర్మించి వాటిలో సతాగ్రహులు వుండాలని, యిళ్లు తయారు కానంత వరకు డేరాలు వేసి అందు వృద్ధుల్ని పిల్లల్ని, స్త్రీలను వుంచాలని, పురుషులంతా మైదానంలో వుండాలని నిర్ణయించాం. అయితే వర్షాకాలం కనుక దాన్ని ఎలా తట్టుకోవాలి? శ్రీ కెలన్ బెక్ యిట్టి విషయాల్లో సమర్దుడు. ఆయన అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు అని అనుకున్నాం.

యాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాం. చార్ల్స్‌టౌనుకు చెందిన సజ్జనుడుడు. డాక్టర్ బ్రిస్కో, ఆయన మాకు అత్యవసరంగా కావలసిన మందుల పెట్టె, అత్యవసరమైన వైద్య పరికరాలు మాకు యిచ్చాడు. ఆ పరికరాల్ని నేను కూడా ఉనయోగించు ఆ పెట్టెను. మేమే ఎత్తుకొని వెళ్లాలి. మా వెంట బండి, ఏమీ లేదు. ఆ పెట్టెలో తక్కువ మందులున్నాయనీ, వందమందికి యిచ్చేందుకు అవసరమైన మందులు , అందులేవని, పాఠకులు గ్రహించే వుంటారని భావిస్తున్నాను. త్రోవలో అనేక గ్రామాలు తగులుతాయి. తగ్గిన